Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు జీతాల టెన్షన్లు తీరవా.. జగన్ సర్కార్ మళ్లీమళ్లీ అవే తప్పులు చేస్తోందా?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు అత్యాశకు పోయి మొదటికే మోసం తెచ్చి పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే తమకు ఉద్యోగ పరంగా భద్రత ఉండటమే కాకుండా తమకు రావాల్సినటువంటి డిఏలు పి ఆర్ సి లు తప్పకుండా వస్తాయి అని అందరూ భావించి ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్న నిధులను కూడా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారు తప్ప ఉద్యోగుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు.

ఒకప్పుడు ఒకటో తేదీని ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పడేది ఇప్పుడు ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఇక దసరా పండుగ సందర్భంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా డిఏలు అందుకున్నప్పటికీ ఆంధ్ర ఉద్యోగులకు మాత్రం డిఏలు కాదు కదా సరైన సమయానికి జీతం పడకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

డీఎల గురించి కలర్ ఫుల్ కబుర్లు చెప్పారు. టైమ్ ఫ్రేమ్ పెట్టి..డీఏలు ఇస్తున్నట్లుగా చెప్పారు. అవన్నీ ఉత్తుత్తి మాటలే. చెప్పిన సమయానికి ఒక్క డీఏ విడుదల కాలేదు. గతంలో పిఆర్సి పేరుతో డిఎ అన్నీ కూడా కవర్ చేసేసారు. ఒక్క డిఎ కూడా ఉద్యోగులకు అందకుండా చేశారు. ఇలా పిఆర్సి పేరుతో డిఎ పెంచినప్పటికీ ఉద్యోగులకు మాత్రం రూపాయి కూడా జీతం పెరగలేదు.

ఒకవైపు ధరలు పెరుగుతున్న జీతం మాత్రం పెరగకపోవడంతో ఉద్యోగస్తులు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇక ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం వారిని హింసించడం జరుగుతుంది. దీంతో చాలామంది ఈ విషయాల గురించి మాట్లాడటానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు కదా అంటూ కామెంట్లు కూడా చేస్తుంటారు. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -