Mukesh Ambani’s Childrens: ముకేశ్ అంబానీ పిల్లల పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.. ఏమైందంటే?

Mukesh Ambani’s Childrens: ఇండియన్ కుబేరుడు అయినటువంటి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వ్యాపార సంస్థలలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ముఖేష్ అంబానీకి ముగ్గురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. నీతు అంబానీ ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ వారసులుగా రిలయన్స్ బాధ్యతలను చేపట్టారని తెలుస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం రిలయన్స్ వ్యాపార సంస్థల వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా ముఖేష్ అంబానీ తన వారసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సభ్యులుగా నియమించారు. ఈ విధంగా బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి ముకేశ్ అంబానీ పిల్లలు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే…

ముఖేష్ అంబానీ వారసులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధ్యతలు చేపట్టినటువంటి ఈ ముగ్గురు రూపాయి వేతనం లేకుండా పనిచేస్తున్నారట. ఇక ఈ ముగ్గురు బోర్డు సమావేశానికి హాజరైనప్పుడు అందుకు సంబంధించిన ఫీజు అలవెన్స్ కమిషన్ రూపంలో మాత్రమే అందిస్తారని అంతకుమించి వీరు ఎలాంటి శాలరీస్ తీసుకోలేదని తెలుస్తోంది. ముఖేష్ ముగ్గురు పిల్లలను కంపెనీ వాటాదారుల్లో భాగంగా చేర్చుకోవడం కోసం మనం చేస్తూ ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారులకు పంపించింది.

అంబానీ భార్య నీతో అంబానీ 2012వ సంవత్సరంలో ఈ కంపెనీ బోర్డ్ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. అయితే ఆమె అప్పట్లో తీసుకున్నటువంటి షరతులే ఇప్పుడు వారి పిల్లలకు కూడా వర్తిస్తాయని తెలుస్తుంది. ఇక తన పిల్లలు బోర్డు డైరెక్టర్లుగా ఎన్నిక కావడంతో నీతు అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసినప్పటికీ బోర్డు సమావేశాలు అన్నిటికీ ఆమె హాజరయ్యే విధంగా శాశ్వత ఆహ్వానితురాలు అనే హోదాను కూడా కల్పించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖేష్ వారసులు జీతం లేకుండా పనిచేస్తుండటం విశేషం.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -