Sr NTR Industry Hits: సీనియర్ ఎన్టీఆర్ కు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ తెచ్చి పెట్టిన సినిమాలు ఇవే!

Sr NTR Industry Hits: తెలుగు ప్రపంచానికి సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి నటనలో తనకంటూ చరగని ముద్ర ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా సొంతంగా కొన్ని సినిమాలను నిర్మించి, మరికొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు సీనియర్ ఎన్టీఆర్. అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ ను సాధించి పెట్టాయి. ఇప్పుడు మనం వాటి వివరాలు తెలుసుకుందాం.

పాతాళ భైరవి: 1951 లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కి అతి పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంతేకాకుండా ఆయనని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు. మొత్తం 25 కేంద్రాల్లో విడుదలైన ఈ సినిమా.. దాదాపు 100 రోజులు ప్రదర్శించబడింది. అప్పట్లోనే 25 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాకుండా ఎన్టీఆర్ కి ఈ సినిమా తో మరో స్థాయిలో గుర్తింపు వచ్చింది.

మాయాబజార్: 1957లో విడుదలైన ఈ సినిమా మన తెలుగు సినీ తెరకే గర్వకారణంగా మిగిలింది. అప్పట్లో భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఎన్టీఆర్ ని మరో స్థాయిలో కూర్చోబెట్టింది. నిజంగా కృష్ణుడు ఎన్టీఆర్ లానే ఉండేవాడా అని ప్రేక్షకులు ఊహించుకునేలా చేసింది. అప్పట్లో ఈ సినిమా ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

లవకుశ: 1963లో విడుదలైన ఈ సినిమా రికార్డులను ఇప్పటికీ ఏ సినిమా కూడా క్రాస్ చేయలేకపోతుంది. టాలీవుడ్ లోనే అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచింది. దాదాపు కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూసిన ఒక్కగాని ఒక్క సినిమా ఇదే. ఈ విధంగా సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -