YS Sharmila to Delhi: కలకలం రేపుతోన్న షర్మిల ఢిల్లీ టూర్.. కేసీఆర్ ప్రభుత్వంలో గుబులు

YS Sharmila to Delhi: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరింత రాజకీయంగా మరింద దూకుడు పెంచారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతూనే.. పొలిటికల్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ దుమారం రేపుతోన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన విమర్శలతో కాక రేపుతోన్నారు. పాదయాత్రలో టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేసే విమర్శలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలకు, అక్రమాలకు పాల్పుడుతుున్నారంటూ పాదయాత్రలో ఆరోపిస్తు్న్నారు. కేసీఆర్ ను ఏకవచనంతో అసభ్యకరంగా, పరుషపదజాలంతో రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వంపై పొలిటికల్ కామెంట్లతో కాక పుట్టిస్తోన్న వైఎస్ షర్మిల సడెన్ గా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రెండు రోజుల పాటు ఢిల్లీలో టూర్ కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల బీజేపీ వదిలి బాణం అంటూ, బీజేపీ ఆమెను వెనుకనుండి నడిపిస్తుందంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో బీజేపీకి ఉపయోగపడేందుకు షర్మిలను ఆ పార్టీ రంగంలోకి దింపిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 6,7వ తేదీల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే షర్మిల మకాం వేయనున్నారు.

ఈ రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్ర పెద్దలను షర్మిల కలిసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. తిరిగి 8వ తేదీన పాదయాత్ర ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వం కాంట్రాక్ట్ లు మూకుమ్మడిగా మేఘా సంస్థకే కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. అవినీతికి సంబంధించి ఆధారాలను గవర్నర్ కు సమర్పించినట్లు ప్రచారం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఫిర్యాదు చేస్తారనే టాక్ వస్తోంది.

ఇక ఇటీవల మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గాలి జనార్దన్ రెడ్డితో జగన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతు ఉంటారు. మైనింగ్ కేసుల్లో జగన్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో గాలి జనార్దన్ రెడ్డి కేసు నేపథ్యంలో జగన్ కేసును కూడా విచాల్సిందిగా ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏమైతుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో షర్మిల ఢిల్లీ టూర్ కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో షర్మిల భేటీ అవుతారనే టాక్ వినిపిస్తోంది.

దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర పెద్దలకు షర్మిల ఎలాంటి ఆధారాలు అందిస్తారు.. షర్మిల వెనుక నిజంగా బీజేపీ ఉందా.. బీజపీ కోసమే ఆమె తెలంగాణలో పనిచేస్తుందా.. షర్మిల భేటీ వెనుక ఏపీ సీఎం జగన్ ను కూడా బీజేపీ ఇరుకున పెట్టే వ్యూహం ఉందా.. ఈ విషయాలు అన్ని ఇప్పటికీ ప్రశ్నార్థకమే. షర్మిల ఢిల్లీ టూర్ తో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతాయో ఏమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -