Sharmila: షర్మిల జాగ్రత్త పడాల్సిందే.. అలాంటి వాళ్ల విషయంలో ఇలా చేయాల్సిందే!

Sharmila: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌పై చంద్ర‌బాబు భారీ కుట్ర‌కు తెర‌లేపారు. అయితే ష‌ర్మిల ప‌సిగ‌ట్టి వాటిని తిప్పి కొట్టార‌ని స‌మాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని పావుగా వాడుకొని ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయపరంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలోనే అందుకు అనుకూలంగా రేవంత్ రెడ్డిని వాడుకున్నారని తెలుస్తోంది.


వైయస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించి దాని ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనే ప్లాన్ చేశారు.అయితే ఈ విషయాలన్నింటిని ముందుగానే పసిగట్టిన షర్మిల చంద్రబాబునాయుడుకి గట్టి జలక్ ఇచ్చారు. చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు ఏదీ జ‌ర‌గ‌డం లేదు. మ‌రోవైపు ష‌ర్మిల‌పై రేవంత్‌రెడ్డి ఉద్దేశ పూర్వ‌కంగానే ఆంధ్రా నేత అనే కామెంట్స్ చేస్తున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు అనుమానిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డి సీతక్క వంటి వారందరూ కూడా ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారని వారి ఇళ్లల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ఫోటోలు కూడా మనకు కనిపిస్తాయని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు వీరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఆమె ఆంధ్ర తరపున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపరని ష‌ర్మిల త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ తెలంగాణ‌లోనే ముడిప‌డి వుంద‌ని కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పార‌ని వైఎస్సార్‌టీపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి కుట్ర‌ల‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ దెబ్బ‌తినే ప్ర‌మాదం వుంద‌నే ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇప్ప‌టికీ చంద్ర‌బాబు నీడ నుంచి రేవంత్‌రెడ్డి బ‌య‌ట‌ప‌డ‌డం లేద‌ని, ఇంకా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్‌ను బ‌లి పెడుతున్నార‌నే సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి వ్యవహారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి వారి నుంచి షర్మిల జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -