SS Rajamouli: ప్రతి సినిమాలో చిన్న లాజిక్ తో భారీ హిట్టు కొడుతున్న జక్కన్న!

SS Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్ కి డైరెక్టర్ గా వ్యవహరించిన అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనంతరం సింహాద్రి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అనే మాటే వినపడలేదు. ఇలా ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈయన సినిమాలపై ప్రేక్షకులకు కూడా కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ప్రతి ఒక్క సినిమా సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే. రాజమౌళి కేవలం ఒకే ఒక చిన్న లాజిక్ తో సినిమాని ముందుకు నడిపిస్తున్నారు. సాధారణంగా అన్ని సినిమాలలో హీరోని హీరో గానే వీళ్ళని విలన్ గానే చూపిస్తారు. హీరోతో పోలిస్తే విలన్ పాత్ర కాస్త తక్కువగానే చూపిస్తారు.

జక్కన్న సినిమాల విషయంలో మాత్రం పూర్తిగా విభిన్నం.ఈయన హీరోతో పోలిస్తే విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండేలా చూపిస్తారు. ఇలా విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నప్పుడు, ఆ హీరో విలన్ పై విజయం సాధిస్తేనే అతనీ గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తుంది. అందుకే ఈయన ప్రతి ఒక్క సినిమాలోను విలన్ పాత్రను చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాలను అందుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -