Chickpea: నానబెట్టిన శనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Chickpea: ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ అలా చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. అందుకోసం నానబెట్టిన శనగలు తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చి శనగలు, అవి నానబెట్టిన నీరు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు శనగలు నానబెట్టిన నీరు తాగితే చాలా మంచిది.

తరచుగా చేస్తూ ఉండటం వల్ల రక్తంలోని షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ప్రతిరోజూ శనగల నీరు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మంచి జీర్ణ వ్యవస్థకు నానబెట్టిన శనగల నీరు దోహదం చేస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, బి , మినరల్స్ అధికంగా లభిస్తాయి. శనగలు, ఆ నీరు తీసుకుంటే శరీరానికి ఫైబర్ అధికంగా లభిస్తుంది. అదేవిధంగా మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.

 

అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. తరచూ శనగల నీటిని తాగితే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడుతారు. మొటిమల సమస్య తగ్గుతుంది. బ్లడ్ లాస్‌ను భర్తీ చేయడంలో శనగలు బాగా పనిచేస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన శనగల నీటిని తాగితే రక్తం పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా శనగల వాటర్‌ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -