Jr NTR: అమిత్ షా-ఎన్టీఆర్ ఏకాంత భేటీ అందుకేనా? తెరపైకి కొత్త కోణం

Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏకాంత భేటీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ గా మారింది. వారిద్దరు ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకున్నారని, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనన ప్రశంసిండానికే అమిత్ షా కలిశారంటూ తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ సినిమా నచ్చితే ఫోన్ లో అభినందనలు చెప్పవచ్చని, ఆర్ఆర్ఆర్ సినిమా నచ్చితే రాంచరణ్,రాజమౌళిని ఎందుకు పిలవలేదనే వాదనలు తెరపైకి వచ్చాయి.

ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా ఎ న్నికైన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ వీరిద్దరి భేటీ ఏర్పాటు చేసినట్లు బయటకు లీకులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ విషయమే కాదని, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. దీనిపై అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో బలపడాలని ఆశిస్తున్న బీజేపీ.. సెటిలర్లు, కమ్మ సామాజికవర్గాల ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్టీఆర్ ను పిలిచి ఉండొచ్చని అంటున్నారు.

ఇక సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుని బలపడాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడిగా నామినేట్ కావడంతో ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా ఇమేజ్ పెరిగింది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర తమిళం, మలయాళ బాషలు కూడా వచ్చు. దీంతో సౌత్ ఇండియాలో బీజేపీ బలోపేతం కోసం ఎన్టీఆర్ వాడుకోవాలని ఆ పార్టీ ప్రణాళికలు వేస్తున్నట్లు చెబుతున్నారు.

 

ఈ క్రమంలో అమిత్ షా-ఎన్టీఆర్ భేటీకి సంబంధించి మరో కొత్తకోణం బయటకు వచ్చింది. విజయేంద్రప్రసాద్ ఆర్ఎస్ఎస్ మీద ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ సినిమాలో పాత్ర కోసమే ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని అంటున్నారు. ఇక తెలంగాణలో రజాకర్ ఫైల్స్ సినిమా తీస్తామంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. రజాకార్ల అరాచకాలను, దొరల అహంకారాన్ని ఇందులో చూపెడతామంటూ బండి సంజయ్ పలుమార్లు వ్యాఖ్యానించారు.

ఆ సినిమా ద్వారా కేసీఆర్ ను ఇరుకున పెట్టి బలంగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. నిజాం పాలనలో రజాకార్లు ఏ విధంగా ప్రజలను దోచుకున్నారు. నిజాం నవాబుకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనే విషయాలను ఈ సినిమా ద్వారా బీజేపీ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఈ సినిమాను ఒక ప్రచార అస్త్రంగా బీజేపీ ఉపయోగించనుంది. ఈ సినిమా వల్ల కేసీఆర్ సామాజికవర్గం వీక్ అవుతుందని, అధికార పార్టీకి మైనస్ అవుతుందని బీజేపీ భావిస్తుంది.

రజాకర్ ఫైల్స్ సినిమా తీసే బాధ్యతలను విజయేంద్రప్రసాద్ కు అప్పగిస్తారని, అందుకే వ్యూహత్మకంగా ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించే అవకాశముందని అంటున్నారు. ఎన్టీఆర్ టాప్ హీరోతో పాటు మంచి నటుడు కావడం, ఎమోషన్స్ బాగా పండించే సత్తా అతనికి ఉండటంతోనే అమిత్ షా కలిసినట్లు చెబుతున్నారు. రజాకర్ ఫైల్స్ సినిమాలో నటించాల్సందిగా అమిత్ షా కోరినట్లు టాక్ నడుస్తోంది.

కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ఎమోషన్స్ అందరినీ కట్టిపడేశాయి. ప్రేక్షకులకు కళ్ల వెంట నీళ్ల తెప్పించాయి. కొమురం భీముడో పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్, ఆ పాటలోని ఎన్టీఆర్ ఎమోషన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ప్రతిఒక్కరికీ ఆ సాంగ్ గూస్బమ్ తెప్పించింది. అందుకే రజాకర్ ఫైల్స్ సినిమా కోసం ఎన్టీఆర్ ను బీజేపీ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అయితే అమిత్ షా ప్రతిపాదనలకు ఎన్టీఆర్ ఒప్పుకుంటుండా.. రజాకర్ ఫైల్స్ సినిమాలో నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -