Pawan kalyan: పవన్ కళ్యాణ్ తో నటించిన కనుమరుగైన హీరోయిన్లు?

Pawan kalyan: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ అన్నాక సెంటిమెంట్ చాలా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్క సినిమా సెంటిమెంట్ తోనే నడుస్తుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కి హీరోలుకు, దర్శకులు కూడా సెంటిమెంట్ ను బాగానే ఫాలో అవుతారు. నిజానికి సినీ ఇండస్ట్రీలో వెలగాలి అంటే టాలెంట్ తో పాటు కొంత అదృష్టం కూడా మనం మూట కట్టుకోవాలి.

అంతే కాదు దీన్నే చాలామంది యాక్టర్లు నమ్ముతూ ఉంటారు. ఏదైనా సినిమాలో కొత్త హీరోయిన్ ని తీసుకున్నప్పుడు ఆ సినిమా పూర్తిగా ప్లాప్ ను చవి చూస్తే.. ఇక ఆ హీరోయిన్ కి తిప్పలు తప్పలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటినుంచి ఆ హీరోయిన్ ను మంచి హిట్ కొట్టేవరకు ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరును జోడిస్తారు. మరి ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తో నటించిన తొమ్మిది మంది హీరోయిన్లు కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని చాలామంది అనుకుంటున్నారు.

ఇప్పుడు మనం ఆ హీరోయిన్ల వివరాలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ మొదటిగా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సుప్రియ యార్లగడ్డ.. ఆ సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు. అంతేకాకుండా సుస్వాగతం సినిమాలో నటించిన దేవయాని కూడా.. ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పింది.

ఇక తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జింగానియా కూడా ఆ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనబడలేదు. అంతేకాకుండా అదే తమ్ముడు చిత్రంలో నటించిన అదితి గోవిత్రికర్ కూడా ఆ సినిమా తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. ఇక తొలిప్రేమ సినిమాలో నటించిన కీర్తి రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఎదురయింది.

ఇక రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక బాలు సినిమాలో నటించిన నేహా ఒబెరాయ్ కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. అలాగే బంగారం సినిమాలో మీరా చోప్రా.. కొమరం పులి సినిమాలో నికీ షా పటేల్ లు ఈ విధంగానే కనుమరుగయ్యారు. ఇక పంజా సినిమాలో సారా జేన్ డియాస్, అంజలి లవానియా కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -