Dasara Movie: దసరా సినిమాకు దిమ్మతిరిగే షాక్.. కలెక్షన్లు తగ్గిపోయాయా?

Dasara Movie: టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఇటీవల గత నెల మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే రూ.53 కోట్ల మార్కును అందుకుని రికార్డును సృష్టించింది.

అంతేకాకుండా నాని కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​ సినిమాగా నిలిచింది. కాగా ఈ రెండో రోజు నుంచి సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. ఇక సినిమాకి మొదటి సోమవారం అయితే భారీ దెబ్బ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 14.22 కోట్లు రెండో రోజు 5.86 కోట్లు మూడోరోజు 6.73 కోట్లు నాలుగో రోజు 6.72 కోట్లు వసూలు చేయగా ఐదో రోజు కేవలం 1.91 కోట్లు మాత్రమే రాబట్టింది. ఒక దెబ్బకు ఏకంగా ఐదు కోట్ల కలెక్షన్ తగ్గిపోవడం అన్నది షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. సినిమాకి ఈ రేంజ్ లో హైప్ లేకపోయినా వీకెండ్ సెలవులు కలిసి రాకపోయినా నాని సినిమాకి పెద్ద దెబ్బే పడేదని వాదన వినిపిస్తోంది.

 

ఇకపోతే 5 రోజుల టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే..నైజాం: 19.55 కోట్లు, సీడెడ్: 4.81 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తం: 35.44 కోట్లు షేర్ ని సాధించింది. కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో: 4.02 కోట్లు, ఇతర భాషలు: 1.32 కోట్లు ఓవర్సీస్: 8.10 కోట్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా: 50.48 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. అలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజులకు 50 కోట్ల 48 లక్షల షేర్ అంతే 90 కోట్ల 20 లక్షల గ్రాస్ ను సాధించింది. సినిమాకి ఓవరాల్ గా 48 కోట్ల బిజినెస్ జరగకగా 49 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేశారు. ఆ లెక్కన ఈ సినిమా ఆ టార్గెట్ పూర్తి చేసుకుని కోటి 48 లక్షల లాభాలతో దూసుకు వెళుతుంది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయినా సరే ప్రాంతాలవారీగా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -