Dasara: దసరా మూవీకి ఊహించని షాక్.. అక్కడ నష్టపోక తప్పదా?

Dasara: నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా రూ.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ విడుదలైన నాలుగురోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పాలి ఇలా సీడెడ్, నైజాం, ఏరియాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా ఆంధ్రాలో మాత్రం కలెక్షన్ల విషయంలో కాస్త వెనుకబడిందని తెలుస్తోంది.

ఈ సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించగా కొన్నిచోట్ల బయ్యర్లు అప్పుడే లాభాలు అందుకోగా ఆంధ్రాలో మాత్రం కొన్ని ప్రాంతాలలో నష్టాలను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.13.7 కోట్ల బిజినెస్ చేయగా మూడు రోజుల్లోనే రూ.14.37 కోట్ల షేర్స్ రాబట్టి లాభాల్లోకి వెళ్ళింది. సీడెడ్ లో రూ.6.5 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పటిదాకా రూ.3.83 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆంధ్రాలో రూ.14.45 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా రూ.8.61 కోట్ల షేర్ వసూలు చేసింది.

 

ఇలా ఈ సినిమా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో కలెక్షన్ల విషయంలో కాస్త వెనకబడి ఉందని తెలుస్తుంది ఇలా పలుచోట్ల బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లు లాభాలు అందుకుంటూ ఉండగా ఆంధ్రలో మాత్రం కాస్త నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక వచ్చే శుక్రవారం రావణాసుర మీటర్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాల ప్రభావం దసరా సినిమాపై కనుక పడితే ఆంధ్రాలో బయ్యర్లు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇక వీరి నటనకు పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -