Nani-NTR: నాని ఇచ్చిన షాక్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకయ్యారా?

Nani-NTR: నేచురల్ స్టార్ నాని గత కొద్దిరోజుల క్రితం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా బాగా ఆడుతోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. నాని నటన, డ్యాన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా పాత్ర కొత్తగా ఉండటంతో సినిమాకు ప్లస్ అయింది.

నాని సినిమాలంటేనే మాస్ ప్రేక్షకులే కాకుండా అందరూ ఇష్టపడతారు. ఫ్యామిలీతో కలిసి వచ్చి నాని సినిమాలు చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా నాని సినిమాలు ఉంటాయి. అందుకే ఓవర్సీస్‌లో కూడా నాని సినిమాలకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నాని సినిమాలు కలెక్షన్లు తెచ్చుకుంటున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో స్టార్ హీరోలతో సమానంగా నాని క్రేజ్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

దసరా సినిమా కలెక్షన్లలో వన్ మిలియన్ మార్క్‌కు చేరుకుంది. అంతకుముందు ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ, అంటే సుందరానికి వంటి సినిమాలు వన్ మిలియన్ మార్క్ కు చేరుకున్నాయి. దీంతో టాలీవుడ్‌లో వన్ మిలియన్ మార్క్ కు ఎక్కువగా చేరుకున్న హీరోగా నాని రెండో స్థానంలో ఉన్నాడు. మొన్నటివరకు రెండో ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానాన్ని దాటేసి నాని ముందుకు వెళ్లాడు. ఎన్టీఆర్ నటించిన బాద్ షా, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్, జై లవకుశ, జనతా గ్యారేజ్, అవరింద్ సమేత సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను అందుకున్నాయి.

 

ఎన్టీఆర్ 7 సినిమాలు వన్ మిలియన్ మార్క్ ను అందుకున్నాయి. ఎన్టీఆర్ కంటే నాని సినిమాలు ఎక్కువగా వన్ మిలియన్ మార్క్ కొట్టయేడంతో ఎన్టీఆర్ ను దాటేసి నాని ముందుకు వెళ్తున్నాడు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా వన్ మిలియన్ మార్క్ ను దాటేసే అవకాశం ఉంటుంది. అప్పటిలోగా నాని నటించి మరో సినిమాలు విడుదలైతే అవి కూడా వన్ మిలియన్ మార్క్ ను అందుకుంటాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -