Telangana: తెలంగాణ వాళ్ల గురించి తప్పుగా చూపిస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Telangana: మన రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలకు ఒక్కో ప్రాధాన్యత ఉంది ఆంధ్ర పేరు చెబితే గోదావరి అందాలు అక్కడ నోరూరించే వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే రాయలసీమ పేరు చెప్పగానే ఫ్యాక్షన్ కు కేర్ అఫ్ అడ్రస్ గా ఉంటుంది.ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేసిన వారు ఉన్నారు. ఇలా ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.

అయితే ప్రస్తుతం తెలంగాణ అంటే తెలంగాణ కోసం వారు చేసిన సాయుధ పోరాట కథలు గుర్తుకు రావాలి కానీ ప్రస్తుతం తెలంగాణ అంటే తాగుబోతులకు కేరాఫ్ అడ్రస్ అనే విధంగా ప్రస్తుత సినిమాలు తెలంగాణను చూపిస్తున్నాయి అంటూ కొందరు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలలో విలన్ అయినా హీరో అయిన ఇతర క్యారెక్టర్లు అయినా తెలంగాణ భాషలో మాట్లాడుతున్నారు అంటే వారిని నెగెటివ్ వే లోనే చూపిస్తూ ఉన్నారు.

ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం విడుదలైనటువంటి బలగం దసరా సినిమాలను కనుక తీసుకుంటే ఈ రెండు సినిమాలలో ఎక్కువగా మద్యం తాగే సన్నివేశాలను పెట్టారు.ఇలా సినిమాలలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ మద్యం తాగుతూ ఉన్నటువంటి సన్నివేశాలను పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా చూపిస్తున్నారని,ఇలా చూపించడం తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే కాకుండా తెలంగాణను కూడా మనం అవమానపరిచినట్లేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా డబ్బు సంపాదించుకోవడం కోసం మనల్ని మనం చులకన చేసి చూపించుకోవడం మంచిది కాదని ఇకపై ఇలాంటి చిత్రాలు కనుక వస్తే వెంటనే వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించి తెలంగాణ అంటే మద్యం ఏరులై పారడం కాదు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని చాటి చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా తెలంగాణ వారు అంటే తాగుబోతులని చెప్పే, చూపించే ప్రయత్నాలను అడ్డుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -