Lifestyle: పిల్లలు పుట్టాలంటే ఇలాంటి ఆహారం అస్సలు తినకూడదా?

Lifestyle: ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. వాటిలో కార్బోహైడ్రేట్లు కూడా చాలా మంచిది. మనం తినే ఆహారంలో మూడింటి ఒక వంతు కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి. బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, పాస్తా, తృణధాన్యాలు వంటి వాటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. కొంతమంది పిండి పదార్ధాలు కొవ్వుగా భావిస్తారు. కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది. అది పట్టించుకోని పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే చాలావరకు మనం తినే ఆహారమే వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. పురుషులు ఈ విషయాన్నీ నమ్మకపోయినా ఇదే నిజం. స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రాసెస్ చేసిన మాంసాలు ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవడం వల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయి. చేయబడిన మాంసాలలో మేక, గొడ్డు మాంసం, పంది మాంసం ఉన్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

 

అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అలాగే సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్, ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకునేవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం మానేసి బాదం పాలు, తక్కువ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. అబ్బాయిలు, మద్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతిగా మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ వినియోగం సెక్స్ డ్రైవ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. తరచుగా మద్యం తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -