Shreya Saran: ప్రెగ్నెన్సీ విషయం దాచడం పట్ల శ్రేయ ఆసక్తికర కామెంట్స్.

Shreya Saran: టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న శ్రియ.. అప్పటి నుండి ఇప్పటి వరకు తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య కూడా కొన్ని కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. మొదటగా “ఇష్టం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రియ.. తర్వాత వరుస సినిమాలు చేసింది. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలు తీసి స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించింది. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

ప్రెగ్నెన్సీ విషయాన్ని సీక్రెట్ గ ఉంచిన శ్రియ.
2018 సంవత్సరంలో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 202 1లో తన కూతురుకు జన్మనిచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన కూతురు పుట్టే వరకు ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకుండా సీక్రెట్ గా ఉంచింది శ్రియ. సోషల్ మీడియాలో గానీ, అభిమానులతో గానీ, మీడియాతో గానీ తాను ఈ విషయం షేర్ చేసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇటీవల ఈ విషయం గురించి సీక్రెట్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

ఇటీవల తాజాగా హిందీలో దృశ్యం-2 మూవీలో నటించిన శ్రియ.. ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాతో చాలా విషయాలు పంచుకుంది. వాటిలో తన ప్రెగ్నెన్సీ విశేషాలను కూడా షేర్ చేసుకుంది. తనకు బిడ్డ పుట్టేవరకు కూడా ఆ విషయాన్ని రహస్యంగా దాచడానికి కారణం చెప్పుకొచ్చింది శ్రియ. తన కూతురు ‘రాధ’ తన కడుపులో పెరుగుతున్నప్పుడు ఆ అందమైన క్షణాలను ఆస్వాదించాలని అనుకుందట శ్రియ. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ మాతృత్వపు భావనలు పదిలపరుచుకోవాలని భావించిందట.

 

తనకు నిజంగానే పంచుకోవాలని ఉన్నా కేవలం ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు చెప్పుకొచ్చింది. ఆ టైమ్ లో ఎవరైనా లావుగా అవ్వడం, శారీరక మార్పులు సహజం. ఈ విషయం మీడియాకు తెలిస్తే బడి షేమింగ్, ఇతర వార్తలు వచ్చేవని, దానివల్ల తాను ఒత్తిడికి గురి అవుతానేమోనని కారణంతో ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచానని చెప్పింది. మొత్తానికి తాను అనుకున్నట్టుగా అమ్మతనాన్ని ఆస్వాదించింది శ్రియ.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -