Shruthi Haasan: శృతి హాసన్ కు అదంటే చచ్చేంత భయమటా.. పాపం!

Shruthi Haasan: ప్రముఖ గొప్ప నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి తెలియని వారుండరు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట్లో ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి లక్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా ఘోర పరాజయానికి పాలయ్యింది. దీంతో శృతి హాసన్ పై ఎన్నో విమర్శలు చేశారు.

ఆ తర్వాత సిద్ధార్థ్ సరసన ఓ సినిమాను చేసింది. ఆ సినిమా కూడా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత ఆమెకు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. దీంతో శృతి పై ఉన్న విమర్శలు తొలగిపోయాయి. అయితే ఆ తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.

అందులో కూడా కొన్ని సినిమాలు పరాజయాల పాలవ్వడం తో కొన్ని రోజులు ఇండస్ట్రీ కు దూరంగా ఉంది. అయితే క్రాక్ సినిమా తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఆఫర్ లతో బిజీ గా ఉంది. అదే విధంగా సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ ఎన్ బీకే 107 లో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ కోసం టర్కీ కు వెళ్ళారు. ఆ సమయం లోని ఓ ఫోటో ను షేర్ చేసింది. ఆ ఫోటో కు నాకు దూర ప్రయాణాలు అంటే భయం అని క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం శృతి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సలార్ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ఆద్యా పాత్ర ను చేయబోతుంది. శృతి హాసన్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -