Shruti Haasan: అతడి వల్లే పూర్తిగా మారిపోయానంటున్న శృతి హాసన్

Shruti Haasan: కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి హాసన్ తనకంటూ ఓ ఫేమ్ ను సంపాదించుకున్నారు. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా శాంతను అనే వ్యక్తితో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. శాంతను హజారికాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు ఆమె గతంలోనే తెలిపారు. ఇద్దరూ కలిసి లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

పార్టీలు, పబ్బులు, వెకేషన్స్ అంటూ ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోంది. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని, తాజాగా తన ప్రేమ వ్యవహారంతో పాటుగా హజారికాతో డేటింగ్ చేసిన తర్వాత తన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటి వల్ల తాను ఎంతో ఆనందంగా ఉంటున్నానని తెలిపారు.

తాజాగా శృతి హాసన్ తన హాలీవుడ్ మూవీ ‘ది ఐ’ షూటింగ్‌ను ఫినిష్ చేసి గ్రీస్ నుంచి ఇండియాకు చేరారు. వచ్చీరాగానే తన బాయ్ ఫ్రెండ్ తో ఆమె తీసుకున్న ఫోటోలను నెట్టింట పెట్టేశారు. ఈ తరుణంలో తన లవర్ గురించి పలు విషయాలను వెల్లడించారు. శాంతను, తాను చాలా మంచి స్నేహితులమని, ఇద్దరం చాలా సరదాగా ఉంటామని అన్నారు. కొన్నిసార్లు తమ గురించి సోషల్ మీడియాలో వచ్చే తమాషా కామెంట్స్ ను చూసి ఇద్దరం ఎంతగానే ఎంజాయ్ చేశామని ఆమె చెప్పుకొచ్చారు.

 

శాంతనుతో డేటింగ్ తర్వాత తనలో అనేక మార్పులొచ్చాయని, గతంతో పోల్చితే తాను ఇప్పుడు చాలా ప్రశాంతంగా, కూల్ గా ఉన్నానని అన్నారు. తన లవర్ చాలా దయగా, ప్రశాంతంగా ఉంటాడని, తనను జీవితంలో వదులుకోలేనని శృతి హాసన్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -