Venkatesh: విక్టరీ వెంకటేశ్ కు ఇలాంటి పరిస్థితా.. అయ్యో పాపం అంటూ?

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. కాగా గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్ ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించాడు. కాగా హీరో వెంకటేష్ ఇటీవల కాలంలో సోలోగా కాకుండా ఎక్కువగా తోటి హీరోలతో కలిసి మల్టి స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ హీరో రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ వెబ్ సిరీస్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అవడం విషయం పక్కన పెడితే ఈ సిరీస్ పై నెటిజన్స్ భారీగా ట్రోల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో బతుకమ్మ పాటను పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట సూపర్ హిట్ అవడంతో ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారు మోగిపోతోంది. ఈ పాటలో వెంకటేష్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ముగ్గురు కలిసి పంచ కట్టుకొని డాన్స్ ని ఇరగదీసారు. ఈ విషయంలో వెంకటేష్ ని మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇటీవల రారా నాయుడు వెబ్ సిరీస్ లో నటించి విమర్శలను ఎదుర్కొన్న వెంకటేష్ ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ పక్కన ఇలా డాన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. ఇలా వెంకటేష్ సైడ్ హీరోగా మారిపోవడం ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్ల దగ్గుపాటి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నెటిజన్స్ వెంకటేష్ విషయంలో స్పందిస్తూ.. మొన్న రానా నాయుడు వెబ్ సిరీస్ తో సగం దిగజారి పోయిన వెంకటేష్ తాజాగా డాన్స్ వేసి పూర్తిగా దిగజారి పోయాడు అంటూ మండిపడుతున్నారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా సైడ్ హీరోగా డాన్స్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -