Chiranjeevi-Balakrishna: చిరంజీవి బాలయ్య సినిమాల టైటిల్స్ లో ఈ పోలికను మీరు గమనించారా?

Chiranjeevi-Balakrishna: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పెద్ద ఎత్తున సినిమాల విషయంలో పోటీ ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య సినిమాల పరంగా పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఇలా ఇండస్ట్రీలో ఈ హీరోలు ఇద్దరు కూడా స్టార్ హీరోలే అయినప్పటికీ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా పోటీ పడ్డాయి.అయితే కొన్నిసార్లు చిరంజీవి హిట్ అందుకోగా మరికొన్నిసార్లు బాలకృష్ణ హిట్ అందుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ హీరోలు వయసు పైబడినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నందమూరి నటసింహం అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకోగా…మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఇకపోతే ఇద్దరి హీరోల తదుపరి సినిమాల గురించి అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా స్టార్ హీరోలు అయినప్పటికీ వీరి తదుపరి సినిమాల టైటిల్ విషయంలో కూడా ఒకేలా పోటీ పడుతున్నారు.

చిరంజీవి తన 154వ చిత్రాన్ని బాబి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఇక బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇన్ని రోజులు NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్నప్పటీకీ అక్టోబర్ 21వ తేదీ కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.

ఇలా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ అనౌన్స్ చేశారు.ఇలా స్టార్ హీరోలు ఇద్దరు సినిమాలలోనూ వీర అనే కామన్ పదం ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఇద్దరి హీరోలు వారి సినిమా టైటిల్ విషయంలో వీర అనే పదం కామన్ గా ఉంది మరి ఈ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటాయి ఎవరు వీరులుగా నిలుస్తారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -