Adipurush: ఆదిపురుష్ విషయంలో ఇన్ని పొరపాట్లా.. ఇంత దారుణంగా చేయాలా?

Adipurush: తాజాగా శుక్ర‌వారం రోజున విడుద‌లైన‌ ఆదిపురుష్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒకవైపు ఈ సినిమా కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు మాత్రం ఈ సినిమాను వివాదాలు నెగిటివ్ కామెంట్లు అంటూ సినిమాలపై నెగటివ్ ప్రచారాలను సృష్టిస్తున్నారు. కేవలం నెగిటివ్ వార్తలు విమర్శలేనా అంటే తాజాగా ఆదిపురుష్ మూవీలో కొన్ని స‌న్నివేశాలు అభ్యంత‌ర‌కరంగా ఉన్నాయంటూ ఢిల్లీ హై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది. ఈ సినిమాలో హిందూవుల మ‌నోభావాలు, విశ్వాసాలు దెబ్బ‌తీసేలా స‌న్నివేశాలు ఉన్నాయ‌ని హిందూసేన జాతీయ అధ్య‌క్షుడు గుప్త ఢిల్లీ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

వాల్మీకీ, తెల‌సీదాస్ ర‌చించిన రామాయ‌ణంలోని పాత్ర‌ల‌కు విరుద్ధంగా ప్ర‌ధాన పాత్ర‌ల్ని అనుచిత రీతిలో తెర‌కెక్కించార‌ని, దేవ‌తా మూర్తుల వ‌ర్ణ‌న స‌రిగా లేద‌ని, బ్ర‌హ్మ‌ణుడైన రావ‌ణుడ్ని గ‌డ్డంతో చూపించ‌డం అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని, రావ‌ణుడికి సంబంధించిన స‌న్నివేశాలు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌ని, ఆయా స‌న్నివేశాల్ని స‌రిదిద్దాల‌ని, లేదంటే పూర్తిగా తొల‌గించాల‌ని, అప్ప‌టి వ‌ర‌కూ ఆదిపురుష్ ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని నిలిపివేయాల‌ని పిటీష‌న్‌లో కోరారు. ఈ పిటీష‌న్‌పై కోర్టు విచార‌ణ చేప‌ట్టి, తీర్పు వెలువ‌రించాల్సి ఉంది.

 

ఈ సినిమా విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 140 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది. ఒకవైపు కనెక్షన్ సాధిస్తుండగా మరొకవైపు కోట్లు కేసు దాఖలు కావడం అన్నది ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఈ సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించాడు. ఇందులో గ్రాఫిక్స్, కొన్ని సన్నీ వేషాలు, డైలాగ్ లు అంత బాగోలేవు అంటూ చాలామంది నెగిటివ్ గా వార్తలు సృష్టిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -