Sonia Gandhi: తెలంగాణ పర్యటనను సోనియాగాంధీ.. రాహుల్ పాదయాత్రలో పాల్గొనే అవకాశం

Sonia Gandhi:  భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ లోని కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. సుమారు 3,800 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర జరగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో రాహుల్ పాదయాత్ర ముగియగా.. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. కర్ణాటకలో ముగిసిన తర్వాత తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర అడుగుపెట్టనుంది.

ఈ నెల 27న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనుంది. కర్ణాటక నుంచి తెలంగాణలోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. సుమారు 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగే అవకాశాలున్నాయి. రాహుల్ పాదయాత్రకు ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జోడో యాత్ర కోసం ప్రత్యేక కమిటీలను నియమించారు. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు, జనసమీకరణ చేసేలా ఈ కమిటీలు బాధ్యత తీసుకోనున్నాయి. ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్ తెలంగాణకు వచ్చి రాహుల్ పాదయాత్ర ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించారు.

రాహుల్ పాదయాత్రను గ్రాండ్ గా సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో, ఉపఎన్నిక పోలింగ్ సమయంలో రాహుల్ తెలంగాణలోనే రానున్నారు. దీంతో మునుగోడులో ప్రచారం చేయాలా? లేదా రాహుల్ పాదయాత్రను పాల్గొనాలా అనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ ప్యూజన్ నెలకొంది. మునుగోడులో కొంతమంది నేతలు ప్రచారం చేయడం, మరికొంతమంది రాహుల్ పాదయాత్రలో పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఏర్పాట్లపై ఈ నెల 15 మక్తల్ లో జరగనున్న సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దేశంలో సమానత్వం, సమగ్రత కోసం రాహుల్ యాత్ర చేస్తున్నారని, ఈ యాత్రతో సమూల రాజకీయ మార్పులు వస్తాయని చెబుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్ పాదయాత్ర ఉపయోగపడుతుందని హస్తం శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్ పాదయాత్ర ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

తెలంగాణ జరగనున్న రాహుల్ పాదయాత్రలో సోనియాగాంధీ కూడా పాల్గొనేలా రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవ్వుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, శ్రేణులు చెబుతున్నారు. సోనియాాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉండటంతో రాష్ట్ర నేతలు గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు.అన్ని జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జోడో యాత్ర ఏర్పాట్లుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పాదయాత్రపై చర్చిస్తున్నారు. రాహుల్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని, తెలంగాణ ఇచ్చిన సోనియా కూడా పాల్గొనడం వల్ల పార్టీకి మరింత ఊపు వస్తుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -