Sreeleela: తండ్రి ప్రేమకు దూరమైన శ్రీలీలకు తండ్రి ప్రేమను ఇచ్చిన బాలయ్య.. ఏం జరిగిందంటే?

Sreeleela: హీరోయిన్ శ్రీల ఇప్పుడు ఒక ట్రెండ్. ఏ సినిమాలో చూసిన హీరోయిన్ గా శ్రీల పేరే వినిపిస్తోంది. శ్రీ లీల కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ చిన్న వయసులోనే టాలీవుడ్ హీరోలందరితో నటించింది. రీసెంట్ గా బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది శ్రీ లీల. ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురుగా విజ్జి పాపా క్యారెక్టర్ లో నటించింది.

ఈ సినిమా తనకి బాగా కనెక్ట్ అయిందని శ్రీ లీల భగవంత్ కేసరి మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయింది. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ నాకు లైఫ్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదో అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు నాకు అందించారు, అందుకు మీకు చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమాలో ఈ పాత్ర నాకు దొరకటం నిజంగా నాకు అదృష్టం. ఈ సినిమాలో చాలా సీన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా కూడా ఆ మూడ్ నుంచి బయటికి రాలేకపోయే దాన్ని.

అంతగా ఆ క్యారెక్టర్ నాకు కనెక్ట్ అయిపోయింది. అలాంటి సమయంలో మీరు నా దగ్గరికి వచ్చి నన్ను ఆ మూడు లోంచి బయటికి తీసుకురావడానికి చాలా జోవియల్ గా బిహేవ్ చేసేవారు. నిజంగా మీ మంచి మనసుకి నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల. అయితే ఆమె అంతగా ఎమోషనల్ అవ్వటానికి గల కారణం ఏమిటంటే.. శ్రీలీల చిన్నతనం నుంచి తండ్రి ప్రేమని పొందలేదు. అందుకు కారణం శ్రీ లీల చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

అప్పటినుంచి ఆమె తన తల్లి దగ్గరే పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె తండ్రిగా చెప్పుకునే వ్యక్తి శ్రీలీల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీ లీల దీని గురించి పబ్లిక్ గా ఎప్పుడు స్పందించలేదు. అంతేకాదు అసలు ఆమె తండ్రి గురించిన ప్రస్తావన రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -