Sreeleela: విడ్డూరం కాకపోతే.. ఈ మాత్రానికే శ్రీ లీలకి పెళ్లి చేసేస్తారా?

Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ శ్రీ లీల మాయలో ఉంది. ఎవరి నోట విన్న శ్రీలీల పేరే, ఏ సినిమా చూసినా శ్రీ లీలే హీరోయిన్. 22 సంవత్సరాలకే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ స్టార్డం తెచ్చుకొని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ హీరోయిన్ గా నటించిన క్రెడిట్ శ్రీ లీలది. ఆమె టాలెంట్ కూడా మామూలుది కాదు. యాక్టింగ్ అయినా డాన్స్ అయినా ఇరగదీసేస్తుందంతే. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి పెళ్ళిసందడి సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. సినిమా టాక్ ఎలా ఉన్నా శ్రీ లీల పేరు మాత్రం టాలీవుడ్ మొత్తం పాకిపోయింది.

ఇక రెండవ సినిమా అయినా ధమాకా మాస్ మహారాజా రవితేజతో జతకట్టడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సినిమాలు ఆమె ముందు క్యూ కట్టాయి. ఇప్పుడు ఆమె చేతిలో గుంటూరు కారం తో సహా పెద్ద సినిమాలే ఉన్నాయి. అయితే సినిమా తారలన్నాక రూమర్సు తప్పవు, కానీ కొన్ని రూమర్స్ మరి విడ్డూరంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలీలపై వచ్చిన రూమర్ అలాంటిదే. శ్రీలీలకి మోక్షజ్ఞ కి పెళ్లి అనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. 22 ఏళ్ల వయసులో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఆమె ఇంత చిన్న వయసులో అది కూడా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి ఎలా చేసుకుంటుంది. ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా రూమర్స్ ని ఇలా క్రియేట్ చేయడం అనేది హర్షించే విషయం కాదు.

అయితే ఒక వర్గం వారు మాత్రం ఊరికే ఇలాంటి రూమర్స్ రావడం లేదు,వాటికి కూడా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇంతకీ ఆధారాలు ఏమిటంటే ఈమధ్య తరచుగా మోక్షజ్ఞ, శ్రీ లీల కలిసి దిగిన ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి తోడు మొన్న బాలకృష్ణ స్టేజ్ మీద మోక్షజ్ఞ నా పిల్ల అన్నాడు అని చెప్పడంతో ప్రేక్షకుల ఊహలకు రెక్కలు వచ్చేసాయి. అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ,శ్రీలీలతో భగవంత్ కేసరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీం తో కలిసి తీసుకున్న ఫోటోలో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు.

ఈ మాత్రానికే వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోతున్నట్లు రూమర్లు పుట్టించేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మోక్షజ్ఞ ను సినీ హీరోగా తెరంగేట్రం చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు బాలకృష్ణ. మోక్షజ్ఞ కూడా ఒకవైపు తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద దృష్టి పెడుతూనే సినిమాలు మేకింగ్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు. అందులో భాగంగానే భగవంత్ కేసరి టీం తో అసోసియేట్ అయ్యాడు మోక్షజ్ఞ. పుకార్లకు ఏముంది గాని త్వరలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వచ్చే ఛాన్స్లు అయితే మాత్రం కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -