Sreeleela: స్కంద గాయానికి మందులా మారిన బాలయ్య మూవీ.. ఆ బ్యూటీ జాతకాన్ని మార్చేస్తుందా?

Sreeleela: స్కంద గాయానికి మందులా మారిన బాలయ్య మూవీ.. ఆ బ్యూటీ జాతకాన్ని మార్చేస్తుందా? ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరంటే మనందరికీ ముందు గుర్తొచ్చే పేరు శ్రీ లీల. ఈ మధ్యకాలంలో తను చాలా బిజీ హీరోయిన్గా మారిపోయింది. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు నెలకు ఒక సినిమా విడుదలతో మరే హీరోయిన్ లేనంత బిజీగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నది శ్రీలీల మాత్రమే.

ధమాకా సినిమాతో అందరినీ అలరించిన శ్రీ లీలా దాని తర్వాత రామ్ తో స్కంద సినిమాతో వచ్చింది కానీ స్కంద అనుకున్నంత అవుట్ పుట్ ఇవ్వలేకపోయింది. అందులో రామ్ తో లవ్ ట్రాక్ కానీ, వీళ్ళిద్దరూ వేసిన డాన్స్ కానీ అభిమానులని ఆకట్టుకోలేకపోయాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో అసలు తను ఎందుకు వచ్చి వెళ్ళిపోతుందో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి.

అయినా సరే దాని తర్వాత బాలయ్యతో వచ్చే భగవత్ కేసరి తో హిట్ కొడదామని ధీమాగా ఉంది ఈ తార. మామూలుగా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరియర్ అంటే గ్లామరస్ రోల్స్ తీసుకొని లవ్ ట్రాక్ లాంటి సినిమాలు తీస్తారు. కానీ శ్రీ లీల మాత్రం అందరికన్నా డిఫరెంట్ గా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ తీసుకొని బాలయ్యకి కూతురుగా నటిస్తుంది.

ఇందులో సినిమా అంతా శ్రీ లీల క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఈ సినిమాకి ప్రాణం పోసింది తన క్యారెక్టరే అంత. బాలయ్య తో పాటు తను నటించడం చాలా గొప్ప విషయం బాలయ్య కోసం చాలామంది టికెట్లు కొనగా ఈమె కోసం కూడా టికెట్లు కొనే సంఖ్య చాలా పెద్దదే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, శ్రీలీల కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -