Sreemukhi: కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ఇంట్లో వాళ్లతో కలిసి పోజులిచ్చిన యాంకర్‌!

Sreemukhi: యాంకర్‌ శ్రీముఖి ఇటీవల దూసుకెళ్తోంది. కెరీర్‌లో మంచి జోరు కొనసాగిస్తోంది. యాంకర్‌గా తనదైన శైలిలో మార్కెట్‌లో టాప్‌లో ఉంది. ఈ మధ్య కాలంలో ఏ షో నిర్వహించినా అందులో శ్రీముఖి ఉండాల్సిందే అన్నట్లు ఆమె కెరీర్‌ సాగిసోతోంది. ఆ మధ్య కాలంలో బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం అవకాశాలు విపరీతంగా పెరిగాయి. దీంతో నిత్యం బిజీగా గడుపుతోంది శ్రీముఖి.

 

యాంకర్‌ శ్రీముఖి ఇటీవల సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. షోల్లో పాల్గొన్న తర్వాత ఆ ఫొటోలను షేర్‌ చేసుకుంటూ అభిమానులను నానాటికీ పెంచుకుంటోంది. ఈ క్రమంలో అందంతో పాటు యాంకరింగ్‌లోనూ ప్రత్యేకత చూపుతోంది శ్రీముఖి. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులకు మంచి స్పందన లభిస్తోంది. యువతలో బాగా క్రేజ్‌ సంపాదించుకుంటోంది శ్రీముఖి.

 

బుల్లితెరపై బాగా సెటిలైన శ్రీముఖి.. చలాకీతనంతో అనతికాలంలోనే సర్కిల్‌ పెంచుకుంది. పలు టీవీ ఛానళ్లలో ప్రాజెక్టులు కుదర్చుకుంటూ యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది. శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసిందట. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న చందంగా శ్రీముఖి దూసుకెళ్తోంది.

 

సినిమాల్లోనూ యాక్టింగ్‌..
తాజాగా ఇంటిని కొన్న శ్రీముఖి.. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రీసెంట్‌గా తన ఇన్‌ స్టా గ్రామ్‌ అకౌంట్‌ లో షేర్‌ చేసింది శ్రీముఖి. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని శ్రీముఖి పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్‌ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అటు యాంకర్‌గానూ, ఇటు సినిమాల్లో చాన్సులతో శ్రీముఖి జోరుమీద ఉంది.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -