Sridevi: శ్రీదేవి షాకింగ్ కామెంట్స్.. నన్ను అలా తిట్టారంటూ?

Sridevi: ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో భాగంగా పెద్ద అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచారని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన వారి పట్ల జగన్ సర్కార్ చర్యలు కూడా తీసుకుంది.

ఈ క్రమంలోనే క్రాస్ ఓటింగ్ కి పాల్పడినటువంటి నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇలా సస్పెన్షన్ అయినటువంటి వారిలో ఉండవల్లి శ్రీదేవి ఒకరు.ఈమె దాదాపు 15 కోట్ల వరకు డబ్బులు తీసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈమె తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇలా శ్రీదేవి పట్ల ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో ఈమె ప్రస్తుతం హైదరాబాదులో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి అవినీతి గురించి తనకు తెలుసు కాబట్టి తనని పార్టీ నుంచి తప్పించారు అంటూ ఈమె ఆరోపణలు చేశారు. ఇక ఏపీలో తనకు ప్రాణహాని ఉందని కొందరు వైసిపి గూండాలు తన పార్టీ ఆఫీసు పై దాడి చేయడంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని హైదరాబాద్ వచ్చానని అక్కడ తనకు ప్రాణహాని ఉంది అంటూ ఈమె మీడియా ముందు వెల్లడించారు.

 

ఇక ఆంధ్రప్రదేశ్లో సాధారణ మహిళలకు ఏమాత్రం భద్రత లేదని ఈమె వెల్లడించారు. ఒక ఎమ్మెల్యే ఐవిఎఫ్ స్పెషలిస్ట్, డాక్టర్ అయినటువంటి తనని పట్టుకొని మాదిగ ముండా అంటూ దూషించారని, ఎస్సీలు అంటే అంత చులకన అంటూ ఈమె ఆరోపణలు చేశారు. ఇలా ఎంతో మంచి పొజిషన్లో ఉన్నటువంటి తనని ఇలా దూషించడంతో తాను అనంతవరంలో కేసు కూడా పెట్టానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ...
- Advertisement -
- Advertisement -