Chiranjeevi-Sreeleela: చిరంజీవి సినిమాలో శ్రీలీల ఫిక్స్.. ఆ పాత్రలో కనిపిస్తారంటూ?

Chiranjeevi-Sreeleela: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోల వరకు పెట్టి ఒక హీరోలు హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే శ్రీలీల కూడా ఎవరి మనసులు నచ్చుకోకుండా అడిగిన వాళ్లకు లేదు అనకుండా ఓకే చెప్పేస్తుంది. కానీ ఫలానా డేట్ లో షూటింగ్ అంటే ప్రస్తుతానికి తన ఏం చేయాలని ఇచ్చిన డేట్లు అడ్జస్ట్ చేసుకుని షూటింగ్ ఓకే అంటూ క్లారిటీ ఇచ్చేస్తుంది.

ఇక హీరో దర్శకులు కూడా ఆ ముద్దుగుమ్మకు నా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ,నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోల సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో శ్రీలీల అవకాశాన్ని దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా శ్రీలీల పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ మెగాస్టార్ సరసన నటించేందుకు కాదు. అదే సినిమాలో నటించే యువ హీరో సరసన నటించడం కోసం.

 

కాగా ఇటీవల కాలంలో మెగాస్టార్ సోలో సినిమాలు చేయడం లేదు. ఎవరో ఒక యువ హీరో తోడు తీసుకుంటున్నారు. ఈసారి సినిమాలో సిద్దు జొన్నలగడ్డను తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. కానీ ఇందులో అయితే సిద్దూ పక్కన హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకోవాలన్నది మూవీ మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే శ్రీలీల ఒప్పుకోవడం సమస్య కాదు కానీ ఆమె డేట్లు ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిపోయాయి. మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల ప్రస్తుతం వాంటెడ్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -