SS Thaman: మహేష్ చేసేవి చెత్త సినిమాలు..వాటికి మ్యూజిక్ ఎలా కొట్టాలి.. థమన్ సంచలన వ్యాఖ్యలు!

SS Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైనటువంటి సంగీతం అందించడమే కాకుండా పవర్ ఫుల్ బిజిఎంతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించినటువంటి ఈయన పట్ల మహేష్ బాబు అభిమానులు మాత్రం తరచూ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.

ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాలకు పని చేస్తున్నటువంటి తమన్ పెద్దగా ప్రేక్షకులను తన మ్యూజిక్ తో మెప్పించలేకపోయారు. ప్రతి ఒక్క మహేష్ ఫ్యాన్ ఈయనని టాగ్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా భగవంత్ కేసరి సినిమా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఈ సినిమా పట్ల మహేష్ బాబు ఫ్యాన్స్ స్పందిస్తూ భారీగా ట్రోల్స్ చేశారు.

సినిమాలకు మంచి మ్యూజిక్ కంపోజ్ చేసే మీరు మహేష్ బాబు సినిమాలోకి ఎందుకని చేయరు అంటూ కామెంట్ చేశారు అయితే ఈ కామెంట్లపై తమన్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో బహిరంగంగా తెలియజేశారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్ల్స్ ని నేను గమనిస్తూనే ఉన్నాను. సినిమాలో విషయం ఉంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఇవ్వగలను. విషయం లేని సినిమాలకు సన్నివేశాలకు నేనేమి చెయ్యగలను రా బాబు..అప్పటికీ నేను నా నుండి బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను, నచ్చకపోతే మీ ఖర్మ అంటూ చేశారు.

ఈ విధంగా తమన్ కామెంట్ చేయడంతో అంటే మహేష్ బాబు సినిమాలలో కంటెంట్ లేదా… బాబు చేసే సినిమాలన్నీ చెత్తగా ఉంటాయా అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. కంటెంట్ లేని సినిమాలను కూడా బిజీ ఎం ద్వారా పైకి లేపడమే మ్యూజిక్ డైరెక్టర్ల పని తాజాగా జైలర్ సినిమా కంటెంట్ లేకపోయినా బిజిఎం ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే. ఆ మాత్రం కూడా నీకు చేతకాదా అంటూ మహేష్ ఫ్యాన్స్ భారీగా 80 మరోసారి చేస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -