Guntur Kaaram: గుంటూరు కారమంతా బీడీ మాసేనా.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇది న్యాయమేనా అంటూ?

Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్ బాబు. కాగా ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే గుంటూరు కారం సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. తాజాగా దసరా పండగ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది హారిక హాసిని సంస్థ. కారు వెనుక డిక్కీ ఓపెన్ చేసి దాని మీద మహేష్ కూర్చుని స్టైల్ గా బీడీ వెలిగించే స్టిల్ తో పాటు కాళ్ళ కింద కత్తి పట్టుకున్న రౌడీ పడిపోయిన ఫోజు చూపించారు.

ప్రమోషన్లలో మొదటిసారి వదిలిన పోస్టర్ లో కూడా బీడీనే హైలైట్ చేయడం, ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ చివరి షాట్ లో బీడీ కాల్చుకుంటూ నడిచి వచ్చే సన్నివేశాన్నిసెట్ చేయడం ఇదంతా మాస్ కోసమే. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతగా మహేష్ తెరమీద చుట్టలు, బీడీలు కాల్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఫ్యాన్స్ మాత్రం ఒకప్పటి పోకిరి రేంజ్ లో ఇందులో స్మోకింగ్ ఉంటుందని ఆశిస్తున్నారు.

నిజానికి గుంటూరు కారం అందరూ అనుకున్నట్టు ఏదో కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి మాస్, క్లాస్ ఎవరినీ వదిలిపెట్టకుండా అల వైకుంఠపురములో కంటే మూడింతలు ఎక్కువ ఎగ్జై టింగ్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.

ఫస్ట్ ఆడియో సింగల్ కి సంబంధించిన డేట్ మాత్రం ఇవ్వలేదు. కమింగ్ సూన్ అన్నారు తప్పించి స్పష్టంగా తేదీ లేదు. నవంబర్ నుంచి గుంటూరు కారం సందడి స్టార్ట్ అవుతుందని తాజాగా తమన్ ట్వీట్ చేశారు. అంటే మొదటివారం లేదా దీపావళి నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీ జనవరి 12 విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -