Chatrapathi: ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ కలెక్షన్స్ ని అందుకోలేకపోతున్న ‘ఛత్రపతి’.. ప్రభాస్ కు అదే సమస్యంటూ?

Chatrapathi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆయా హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లతో పాటు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా థియేటర్ లో మరోసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, చిరంజీవి బాలకృష్ణ నటించిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. మరి కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ ను సాధించాయి.

కాగా ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. ఉదాహరణ నేడు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కాబోతున్న ఛత్రపతి సినిమా. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ఛత్రపతి సినిమాని లేటెస్ట్ 4K కి మార్చి రీ రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో మునుపటి రేంజ్ జోష్ లేదు. చాలా మందికి ఈ సినిమా విడుదల అవుతున్నట్టు కూడా తెలియదు. అందుకే ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయిల కంటే తక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఈ ఏడాది సరైన ప్లానింగ్ లేకుండా విడుదలైన పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రానికి కేవలం మొదటి రోజే కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ కలెక్షన్స్ ని ఛత్రపతి సినిమా అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం దసరా పండుగకి కొత్త సినిమాల హవా నడుస్తుండడం, దానికి తోడు ఛత్రపతి సినిమాకి ఫ్యాన్స్ అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యకపోవడం వల్లే సినిమాకి ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదని, మొదటి రోజు కోటి రూపాయిల కంటే తక్కువ గ్రాస్, అలాగే ఫుల్ రన్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -