Chatrapathi: ఛత్రపతి మూవీ రీ రిలీజ్ అప్పుడే.. ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమేనా?

Chatrapathi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్బంగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఫ్లాప్ సినిమాలను థియేటర్లలో మరొకసారి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభాస్,మహేష్ బాబు,చిరంజీవి,బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో మరోసారి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పటి మూవీస్ 4కె ముస్తాబుతో వెండి తెరపై మంచి జోష్ తెప్పిస్తున్నాయి.

అంతేకాకుండా డిజాస్టర్ అయినా డిఫరెంట్ ప్రయోగత్మక సినిమాలు కూడా ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అవుతుండడంతో అలాంటి సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అలాంటి సినిమాలు విడుదల అయి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా మరికొన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇక లవ్ స్టోరీలు స్టార్ హీరల మాస్ యాక్షన్ ఎలివేషన్స్ సినిమాలు నెలకొకటి అయినా ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటున్నాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ఖాతాలో ఎన్నో బాక్సాఫీస్ ఉన్నాయి. ఇక వాటిలో హై వోల్టేజ్ మూవీ అయినా చత్రపతి కూడా రీ రిలీజ్ రేస్ లో రికార్డులో తిరగరాసేందుకు రెడీ అవుతుంది.

ప్రభాస్ మాస్ హీరోగా మరో లెవెల్ కు తీసుకువెళ్లిన ఈ సినిమా అప్పట్లోనే ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ 4k క్వాలిటీతో విడుదల చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కాగా ప్రభాస్ కు సంబంధించిన వర్షం బిల్లా సినిమాలు ఇదివరకే రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సినిమాలు పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకున్నాయి కానీ మరి రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన చత్రపతి పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కు ఒక మంచి ట్రీట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి మదర్ సెంటిమెంట్ గురించి చాలా చర్చించుకుంటారు.. ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మేజర్ ప్లేస్ పాయింట్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -