Chatrapathi: ‘ఛత్రపతి’ లో విలన్ రోల్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chatrapathi: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ మొట్టమొదటి చిత్రం చత్రపతి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా టీవీలో ప్రసారమైతే అతుక్కునిపోయి చూసేవారు చాలామంది ఉన్నారు.

ఇద్దరి కెరీర్స్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అలాగే ప్రభాస్ ని పెద్ద మాస్ హీరో రేంజ్ కి ఈ సినిమా తీసుకెళ్లింది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం వీళ్ళ కెరీర్ హైయెస్ట్ మాత్రం కాలేకపోయింది. రాజమౌళి సింహాద్రి చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఛత్రపతి మూవీకి కేవలం 14 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయి. ఇకపోతే చత్రపతి సినిమాలో హీరో ప్రభాస్ కి విలన్ కి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటాయి. ప్రభాస్, కాట్ రాజ్ మధ్య వచ్చే ఫైట్ సన్నివేశం, అలాగే ప్రభాస్, బాజీ రావ్ మధ్య వచ్చే ఫైట్ సన్నివేశం సినిమాకి ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి.

అయితే ఈ బాజీ రావ్ పాత్ర కోసం ముందుగా జగపతి బాబుని సంప్రదించారట. కానీ అప్పటికి ఆయన హీరోగా కొనసాగుతుండడంతో పాటుగా మంచి హిట్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా రాజమౌళి ధైర్యం చేసి అడిగాడట. కానీ జగపతి బాబు మాత్రం నో అన్నాడట. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉన్న నన్ను విలన్ గా పెట్టుకుంటే మీ సినిమాకి మైనస్ అవుతుంది అన్నాడట, అప్పట్లో జగపతి బాబు మైండ్ సెట్ అలా ఉండేది. ఇక వేరే ఛాయస్ లేక బాలీవుడ్ నటుడు నరేంద్రని తీసుకున్నారు జక్కన్న.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -