CM KCR: కేసీఆర్ పథకానికి అలాంటి రెస్పాన్స్.. కేసీఆర్ తప్పు చేస్తున్నారా?

CM KCR: తెలంగాణ సర్కార్ కులవృత్తులపై ఆధారపడుతున్నటువంటి వారికి శుభవార్తను తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. కుల వృత్తులపై ఆధారపడిన బీసీలకు అన్ని అర్హతలు ఉంటే వారి ఖాతాలలో నేరుగా లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలోకి తెలంగాణ సర్కార్ జమ చేయనున్నారు. అయితే కెసిఆర్ ఈ పథకాన్ని ప్రకటించడంతో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఈ విధంగా లక్ష రూపాయలను పొందడం కోసం ఏకంగా 40 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తుంది.

 

ఇలా ఈ పథకం పొందడం కోసం అన్ని అర్హతలు ఉన్నవారు మీసేవ వద్ద ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇలా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20వ తేదీ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.ఈ క్రమంలోనే మీసేవ ముందు పెద్ద ఎత్తున లబ్ధిదారులు లైన్లో నిలబడుతున్నారు అలాగే చిన్న చిన్న తప్పులు కనుక ఉంటే అధికారులు తమ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.

కెసిఆర్ ప్రకటించిన ఈ పథకం కు దాదాపు 14 రకాల కుల వృత్తుల వారు అర్హులు కావడం గమనార్హం. ఇక నేడు చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో అప్లికేషన్స్ వేస్తున్నారు.అయితే ఒక్కో నియోజకవర్గ నుంచి దాదాపు 30 నుంచి 35 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలుస్తోంది ఊహించని విధంగా ఈ పథకానికి ఇలా అప్లికేషన్స్ రావడంతో అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. ఇలా భారీ స్థాయిలో ఈ పథకానికి అప్లికేషన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

ఇకపోతే ఇన్ని లక్షల అప్లికేషన్స్ రావడంతో ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రభుత్వ సహాయం అందుతుందా అన్న సందేహం కూడా నెలకొంది అయితే తప్పకుండా ప్రభుత్వం కొంతమందికి సహాయం చేయబోతుందని అనంతరం ఎన్నికలు వచ్చిన తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి ఈ పథకం ముందుకు కొనసాగిస్తామని ప్రకటిస్తారు అయితే ఏమాత్రం ప్రజలను మోసం చేస్తున్నారని సందేహం వారికి వచ్చిన మొదటికే మోసం వస్తుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -