Sujana Chowdary: విజయవాడ వెస్ట్ రివ్యూ.. ఆ నియోజకవర్గంలో సుజనా చౌదరికి అడ్వాంటేజ్ ఇదేనా?

Sujana Chowdary: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఇప్పుడు కమలం పార్టీ పోటీ చేసే స్థానాలపై కూడా ఆసక్తి కలుగుతుంది. పొత్తులేకుండా సింగిల్‌గా పోటీ చేస్తే.. ఆ పార్టీ అభ్యర్థులు పెద్దగా ట్రెండింగ్‌లో ఉండేవారు కాదు. కానీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది కనుక మూడు పార్టీ ఓట్లు పడతాయి. దీంతో.. బీజేపీ స్థానాలపై కూడా ఇప్పుడు ఆసక్తి పెరిగింది. అందులోనూ సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై మరింత ఆసక్తి పెరిగింది. ఎందుకంటే.. అక్కడ నుంచి జనసేన పోతిన మహేష్ టికెట్ ఆశించారు. కానీ.. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రత్యర్థి పార్టీ కూడా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొని వచ్చింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. ఆయన్ని వైసీపీ అధిష్టానం విజయవాడ సెంట్రల్‌కు మార్చి.. వెస్ట్‌లో కొత్త వ్యక్తి షేక్ అసిఫ్‌కి ఇచ్చారు. ఇక్కడ 40 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అందుకే వైసీపీ ముస్లిం అభ్యర్థిని తెరపైకి తీసుకొని వచ్చింది. విజయవాడ వెస్ట్ లో పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా నియోజవర్గం ప్రజలకు కొత్తవారే. వైసీపీకి కలిసి వచ్చే అంశం ఆ పార్టీ అభ్యర్థి ముస్లిం వ్యక్తిం. బీజేపీకి కలిసి వచ్చే అంశం. సుజనా చౌదరి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఇక, విజయవాడ వెస్ట్‌లో కాపుల ఓట్లు కూడా 40 వేలకు పైగా ఉన్నాయి. వైశ్య వర్గానికి చెందిన వారు 18 వేలు, బ్రాహ్మణులు 10 వేలు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఐదువేలు ఉంటాయి. ఇక్కడ టీడీపీ, జనసేనకు కూడా బలం ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీలు గెలిస్తే అక్కడ బీజేపీ గెలుపు ఖాయంగా తెలుస్తోంది.

బీజేపీ ఇక్కడ వ్యూహాత్మంగా అడుగులు వేస్తుంది. ముస్లింలు 40 ఉన్నారు కనుక.. హిందూ పోరలైజేషన్ చేసే అవకాశం ఉంది. గతంలో పోటీ చేసిన వెల్లంపల్లి సపోర్టు చేస్తే విజయవాడ వెస్ట్‌లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. కానీ.. వెల్లంపల్లి వెస్ట్ కు వెళ్లి ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న విజయవాడ సెంట్రల్‌లో ఆయన ఎదురీదుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి గతంలో మల్లాది విష్ణు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్ నిరాకరించడంతో.. ప్రస్తుతం పోటీలో ఉన్న వెల్లంపల్లికి ఆయన సపోర్టు చేసే పరిస్థితిలేదు. మల్లాదివిష్ణు లోపాయికారి టీడీపీకి సపోర్టు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు టీడీపీ అభ్యర్థిగా సెంట్రల్‌లో బోండా ఉమా ఉన్నారు. కాబట్టి ఆయనపై గెలవాలంటే వెల్లంపల్లి గట్టిగానే ప్రచారం చేయాలి. అందుకే ఆయన వెస్ట్‌కు వెళ్లి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. వెల్లంపల్లి వెస్టులో పోటీ చేయకపోతే.. అక్కడ వైసీపీ గెలవడం సాధ్యం కాదని స్థానికంగా చర్చ నడుస్తోంది.

విజయవాడ వెస్ట్ నుంచి టీడీపీ ఒకేసారి గెలిచింది. కాబట్టి పొత్తులో భాగంగా ఆ టికెట్ పై ఆశపెట్టుకోలేదు. కానీ, జనసేన నేత పోతిన మహేష్ మాత్రం చివరి వరకూ తానే పోటీ చేస్తానని అన్నారు. అధినేతతో కూడా పలు సార్లు చర్చలు జరిపారు. కానీ, చివరికి ఆ టికెట్ బీజేపీ కొట్టుకుపోయింది. పోతిన మహేష్ గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. కానీ.. టికెట్ దక్కలేదు. అయితే, సుజనా చౌదరి గెలుపులో మహేష్ మద్దతు కీలకంగా ఉంటుంది. జనసేన పూర్తిగా మద్దతు పలికితే సుజనా చౌదని గెలుపు నల్లేరు మీ నడకే అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -