Sukumar: అల్లు అర్జున్ కామెంట్లకు సుకుమార్ సైలెంటయ్యారుగా?

Sukumar: అల్లు అర్జున్ తో సుకుమార్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు స్పోర్ట్స్, పొలిటికల్, సినిమా, మార్కెటింగ్ అన్ని రంగాలను పుష్ప మూవీలోని “తగ్గేదెలే” డైలాగ్ ఊపేసింది. అయితే దాదాపుగా సంవత్సరం పూర్తి అవుతున్నా.. పుష్ప-2 మూవీపై ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇక మూవీ షూటింగ్ జరుగుతుందని కొంత మంది, జరగడం లేదని మరికొందరు అనుకోవడమే తప్ప మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన ఏమి రాలేదు.

 

ఇక ఇటీవల జరిగిన 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ, సుకుమార్ ఇద్దరు కలిసి హాజరయ్యారు. దీనితో పుష్ప మూవీ తదుపరి అప్ డేట్ వస్తుందని అందరు ఆశపడ్డారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు వేయి కళ్లతో వేచిచుసారు. పుష్ప -2 బ్యానర్లతో చాలా హంగామా చేసారు. ఇక బన్నీ సుకుమార్ మాత్రం మళ్ళీ అభిమానులను నిరాశకు గురి చేసారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నెమ్మదిగా సుకుమార్ తోసేసి.. తాను సైలెంట్ గా వెళ్లిపోయాడు.

సేమ్ డైలాగ్ తో తప్పించుకున్న బన్నీ.
అందరు పుష్ప అప్ డేట్ ఇస్తాడేమోనని బన్నీ స్పీచ్ కోసం వేచి చూసారు. కానీ బన్నీ మాత్రం తన ప్రసంగాన్ని సున్నితంగా ముగించి, పుష్ప అప్ డేట్ విషయాన్ని సుకుమార్ పై నెట్టేసి స్టేజ్ దిగేసాడు. అంతేకాకుండా అప్ డేట్ ఇవ్వకపోతే సినిమా డైలాగ్స్ లీక్ చేస్తానని బన్నీ సుకుమార్ కే చిన్నపాటి తియ్యటి వార్నింగ్ ఇచ్చాడు. చివరిలో సంవత్సరం నుండి చెబుతూ వస్తున్న “అస్సలు తగ్గేదెలే” డైలాగ్ చెప్పి తన ప్రసంగాన్ని ముగించేశాడు.

 

ఇంకా.. సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే సినిమా ఎంత లేట్ అవుతున్నా.. తనను ఏమి అనలేక పోతున్నానని చెప్పాడు బన్నీ. దీనితో సినిమా సుకుమార్ వల్లే ఆలస్యం అవుతుందని ఇన్ డైరెక్ట్ గా బన్నీ చెప్పి.. తాను తప్పించుకున్నాడు. ఏది ఏమైనా కనీసం షూటింగ్ జరుగుతుందా? లేదా అనే విషయమైనా చెప్పి ఉండాల్సిందని అంటున్నారు అభిమానులు. పుష్ప-2 అప్ డేట్ కోసం ఇంకెన్ని రోజులు వేచి చూడాలో?

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -