Sukumar: రాజమౌళి కంటే సుకుమార్ తోపా.. సుకుమార్ తో పని చేస్తే సులువుగా అవార్డులు వస్తాయా?

Sukumar: టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు లెక్కల మాస్టర్ అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఒకవేళ కాలేజీలో లెక్కల మాస్టారు సుకుమార్ అలాగే కొనసాగి ఉంటే నేడు టాలీవుడ్ కి ఒక గొప్ప దర్శకుడు మిస్ అయ్యి ఉండేవాడు అని చెప్పడం లేదు ఇటువంటి సందేహం లేదు. వృత్తిపరంగా లెక్కల మాస్టారు అయినప్పటికీ సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక్క అవకాశం కోసం ఎన్నో అవమానాలు అవస్థలు పడి నేడు చివరికి స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్.

అటువంటి సమయంలో సుకుమార్ కి దిల్ రాజు అల్లు అర్జున్ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఆర్య. ఈ సినిమా అప్పట్లో విడుదల అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. లవ్ స్టోరీస్ లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ సినిమా తర్వాత రంగస్థలం వరకు ఆ రేంజ్ హిట్ మళ్ళీ సుకుమార్ కి రాలేదు కానీ, ఈ డైరెక్టర్ సినిమాలన్నీ కొత్తగా ఉంటాయి అనే పేరుని మాత్రం తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు తో చేసిన 1 నేనొక్కడినే తో సుకుమార్ టాలెంట్ మరింత మరోసారి బయటపెట్టారు. ఇందులో మహేష్ బాబు తో అద్భుతమైన నటనని లాక్కున్నాడు. సినిమా అప్పటి ఆడియన్స్ కి బాగా అడ్వాన్స్ గా అనిపించడం వల్ల కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ, సుకుమార్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.

 

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మాత్రం మిస్ అవ్వలేదు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే మొట్టమొదటి నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఇదంతా సుకుమార్ వల్లే సాధ్యపడింది. ఇప్పుడు మన స్టార్ హీరోలకు కలెక్షన్స్ కి వేరే లెవెల్ చూడాలంటే రాజమౌళితో, అలాగే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టింగ్ చెయ్యాలంటే సుకుమార్ తో సినిమాలు చెయ్యాలి. మరి వీళ్ళిద్దరిలో స్టార్ హీరోస్ ఎవరిని ఎంచుకుంటారో చూడాలి మరి. ఈ విషయంలో రాజమౌళి కంటే సుకుమార్ గొప్ప అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -