Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. జూన్ 30లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 19వ తేదీ నుంచి అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఆయనకి బెయిల్ దొరకడం ద్వారా ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకో వివేక హత్య కేసులో ఆయన తరుపున పోరాడుతున్న సునీతకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం అన్నది సునీతకి పెద్ద షాకే.

 

అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి నేరానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్షాలు లేవని ఇప్పటివరకు సిబిఐ జరిగిన దర్యాప్తులో ఎలాంటి సాక్షాలను సేకరించలేదని కనీసం వాటిని కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిందని.

 

వీటి ఆధారంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరినట్లు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి కోర్టుకు వివరించారు. తమ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి ముందస్తుబెయిల్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఏడుసార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఆ తర్వాత రకరకాల కారణాలతో విచారణ వాయిదా వేస్తూ వచ్చారు.

 

అదే సమయంలో అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురికావడంతో పులివెందుల నుంచి ఆమెని కర్నూలు చికిత్స కోసం తరలించారు సిబిఐ విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి వెళ్ళిపోయారు. దాంతో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ కోర్టు అవినాష్ రెడ్డి మాటలనే నమ్మినట్లుగా కనిపిస్తుంది.ముందస్తుబెయిల్ మంజూరు చేసి ఆయనకి ఊరటనిచ్చింది. జూన్ 19 వరకు ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -