Mahesh-Sitara: అదిరిపోయిన మహేష్ బాబు సితార ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో?

Mahesh-Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు.సాధారణంగా మహేష్ బాబు తన సినిమా ఫంక్షన్లకు మినహా ఎప్పుడు ఎక్కడ మనకు బయట కనపడరు.

ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే పెద్ద పెద్ద కార్యక్రమాలకు మాత్రమే ఈయన ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు వంటి కార్యక్రమాలలో మహేష్ బాబు సందడి చేశారు. అయితే తాజాగా జీ తెలుగులో ప్రసారం కాబోయే డాన్స్ షోలో మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ కార్యక్రమం వచ్చేవారం ప్రసారం కానుంది. ఇకపోతే మహేష్ బాబు తన కుమార్తె సితార చేయి పట్టుకొని ఎంతో గ్రాండ్ గా ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక సితార సైతం తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -