Super Star: సంచలన నిజాలు బయటపెట్టిన కృష్ణ ఇంటి పూజారి!

Super Star: సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంధ్రంలో మునిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృష్ణ భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు పద్మాలయ స్టూడియోకి తరలించారు. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి.. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. కృష్ణ కుటుంబీకులను పరామర్శించి.. ఆయన పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు.

 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణ ఇంటి పూజారి కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘30 ఏళ్లగా కృష్ణ గారి ఇంట్లో పూజారిగా కొనసాగుతున్నాను. ఆయన నటించిన పండంటి కాపురం, నాగాస్త్రం ఇంకా కొన్ని సినిమాల్లో పూజారిగా నటించాను. నానక్‌రామ్ గూడంలోని పోచమ్మ అమ్మవారి ఆలయంలో నేను పూజారిగా ఉన్నాను. ఆలయ పూజారిగా కొనసాగుతున్నందుకు కృష్ణ గారే జీతం ఇచ్చేవారు. ఆలయ అభివృద్ధికి కృష్ణ గారు ఎంతో కృషి చేశారు. కృష్ణ గారి కుటుంబంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమాలు నాతోనే జరుగుతాయి. వారంలో ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి పూజలు నిర్వహిస్తూనే ఉంటాం. దానికి తగ్గట్లే కృష్ణ గారు బియ్యం, పండ్లు, సంభావన ఇచ్చేవారు. ఇందిరాదేవి మృతి తర్వాత కృష్ణ గారు మానసికంగా కుంగిపోయారు. ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి వెళ్లేవారు కాదు. ఏదైనా పూజలుంటే తమనే పిలుపించుకునేవారు. కృష్ణ గారికి తన పిల్లలంటే ఎంతో ఇష్టం. మహేష్ బాబు, నరేష్‌ కూడా ఎంతో మంచివారు. కృష్ణ గారి మృతి ఇండస్ట్రీకి తీరనిలోటు. ఆయనను కోల్పోవడం ఎంతో బాధగా ఉంది.’ అని తెలిపారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -