Suryakumar: నాన్ ఓపెనర్‌గా మూడు సెంచరీలు చేసిన ఒకే ఒక్కడు.. సూర్యకుమార్

Suryakumar: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో మూడో సెంచరీని సాధించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సూర్యకుమార్ రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్య చరిత్రకెక్కాడు.

 

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్, మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రో మూడేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఇందులో కొలిన్ మున్రో న్యూజిలాండ్ ఓపెనర్ కాగా మ్యాక్స్‌వెల్ కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగి ఓ సెంచరీని అందుకున్నాడు.

 

అటు టీ20లలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కూడా సూర్యకుమార్ రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో రోహిత్ నాలుగు సెంచరీలతో టాప్‌లో ఉండగా సూర్యకుమార్ మూడు సెంచరీలు, కేఎల్ రాహుల్ రెండు సెంచరీలతో తదుపరి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టీమిండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ 45 బంతుల్లో ఈ ఘనతను అందుకుని రెండో స్థానంలో నిలిచాడు.

 

ఈ ఏడాదిలో టీమిండియాకు తొలి సెంచరీ
2023 ఏడాదిలో టీమిండియాకు సూర్యకుమార్ తొలి సెంచరీని అందించాడు. శ్రీలంకతో మూడో టీ20లో చెలరేగిన అతడు ఈ ఏడాది భారత్ తరఫున తొలి సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఖవాజా, స్మిత్, డెవాన్ కాన్వే, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ ఈ ఏడాది సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. మొత్తానికి తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ ఏడాది తొలి సిరీస్‌ను కూడా టీమిండియాకు సూర్యకుమార్ అందించడం గమనించాల్సిన విషయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -