T20: ఓరియో సెంటిమెంట్ కంటే బలంగా పాకిస్తాన్.. చరిత్ర పునరావృతమైతే భారత్‌కు భారీ షాకే..!

T20:  ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నది. సౌతాఫ్రికా‌తో మ్యాచ్‌లో తప్ప మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో రోహిత్ సేన.. విజయాలతో దూసుకెళ్లుతున్నది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండయా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘ఓరియో సెంటిమెంట్’ గురించి పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఇండియాలో ఓరియో 2011లో లాంచ్ అయిందని, ఆ ఏడాడి భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిందని చెప్పిన ధోని.. ఈ ఏడాది కూడా ఓరియో రీలాంచ్ అవుతుందని, దీంతో ఇండియా కూడా కప్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

ఇప్పటిదాకా జరిగిందంతా ధోని చెప్పినట్టుగానే.. 2011 వన్డే ప్రపంచకప్ లో జరిగినట్టుగానే జరుగుతున్నది. అప్పుడు కూడా లీగ్ దశలో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడింది. ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ కు వెళ్లలేదు. ప్రస్తుత ప్రపంచకప్ లో కూడా ఇదే జరుగుతున్నది. దీనికి తోడు రోహిత్ శర్మ ఆడిన ప్రతీ ఫార్మాట్ లో తొలి టోర్నీ, సిరీస్ గెలిచిన రికార్డు అతడి పేరిట ఉంది.

 

కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం మరో థియరీతో వచ్చింది. అదే 1992 వన్డే ప్రపంచకప్. ఈ మెగా టోర్నీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో అద్భుతం చేసింది. ఈ టోర్నీలో ఆతిథ్య ఆసీస్ సెమీస్ కు చేరలేదు. సెమీస్ లో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ ఆడాయి. భారత్ ను ఓడించిన పాకిస్తాన్ ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి కప్ కొట్టింది.

 

2022 టీ20 ప్రపంచకప్ లో కూడా సెమీస్ కు చేరిన జట్లు ఈ నాలుగే. ఈ క్రమంలో ఇంగ్లాండ్ భారత్ ను ఓడిస్తుందని, న్యూజిలాండ్ ను ఓడించే పాక్.. ఫైనల్లో ఇంగ్లాండ్ ను కూడా ఓడించి కప్ కొడుతుందని, చరిత్ర పునరావృతం అవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చలు సాగిస్తున్నారు.

 

ఇదే జరిగితే మాత్రం భారత జట్టుకు టైటిల్ దక్కనట్టే. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడితే భారత్ ఇంటికి తిరిగిరావడమే. న్యూజిలాండ్ కు పాకిస్తాన్ మీద గొప్ప రికార్డేమీ లేదు. దీంతో ఫైనల్లో ఇంగ్లాండ్ – పాకిస్తాన్ పోటీ పడితే భారత జట్టుకు అది కోలుకోలేని షాక్ అవ్వడం ఖాయం. మరి ఈ సెంటిమెంట్లు రిపీట్ అవుతాయా..? లేక కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతుందా..? తెలియాలంటే ఈనెల 13 దాకా వేచి ఉండాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -