T20 WC 2022: అఫ్గాన్‌పై గెలిచినా లంకపైనే ఆధారపడ్డ ఆసీస్.. అదే జరిగితే కంగారూల కథ కంచికే..

T20 WC 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశ తుది అంకానికి చేరింది. గ్రూప్-1లో ఇంగ్లాండ్, శ్రీలంక మినహ మిగిలిన మూడు జట్లు ఐదు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలున్నా ఇంకా సెమీస్‌కు వెళ్లే రెండో జట్టుపై స్పష్టత రాలేదు. శుక్రవారం ముగిసిన రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్.. ఐర్లాండ్ ను ఓడించి ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్‌పై నెగ్గినా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు నేటితో తేలనున్నాయి. నేడు (శనివారం) ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితం ఈ మెగా ఈవెంట్‌లో కంగారూల భవిష్యత్‌ను నిర్దేశించనుంది.

 

అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆసీస్ అతి కష్టమ్మీద గెలిచింది. కంగారూలు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్తాన్.. 164 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో ఆసీస్ గెలిచినా సెమీస్ చేరలేని దుస్థితి కంగారూలది.

 

ఎందుకిలా..?

ఈ మెగా టోర్నీలో గ్రూప్-1 పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిస్తే.. ఐదు మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించి న్యూజిలాండ్ ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా.. ఐదు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి ఒకటి ఓడి (వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దైంది) ఏడు పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి ఒకదాంట్లో ఓడి (ఒక మ్యాచ్ రద్దు) ఐదు పాయింట్లతో ఉంది. కానీ నెట్ రన్ రేట్ విషయంలో ఆసీస్ (-0.173) కంటే ఇంగ్లాండ్ (+0.547) మెరుగ్గా ఉంది. ఒకవేళ అఫ్గాన్‌ను ఆస్ట్రేలియా నిన్నటి మ్యాచ్‌లో 107 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఆ జట్టు నెట్ రన్ రేట్ మెరుగయ్యేది. కానీ అలా జరుగలేదు.

 

కంగారూల తక్షణ కర్తవ్యం..

ఈ మెగా టోర్నీలో ఆసీస్ సెమీస్ చేరాలంటే దాని ఆశలన్నీ శ్రీలంక మీదే ఉన్నాయి. నేడు శ్రీలంక.. ఇంగ్లాండ్ ను ఓడిస్తే ఆసీస్ సెమీస్ చేరుతుంది. అలా కాకుండా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే అప్పుడు ఇంగ్లాండ్ ఖాతాలో ఒక పాయింట్ చేరినా మొత్తం పాయింట్లు 6 అవుతాయి. అలా చూసినా ఆసీస్‌కే అవకాశాలు. ఇవేవీ గాక ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం కంగారూల కథ కంచికే. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులంతా నేడు లంక గెలవాలని కోరుకుంటున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -