Hyderabad: రైల్వే ట్రాక్ పక్కన ఇన్‌స్టారీల్స్‌ తీస్తూ.. చివరికి అలా?

Hyderabad: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత యువత చాలా మంది చెడిపోయారు అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం వింత వింతగా సెల్ఫీలు భయంకరమైన స్టెంట్లు చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం చుట్టూ ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని మరిచిపోయి వీడియోలు తీయడం సెల్ఫీలు తీయడం లాంటివి చేస్తున్నారు.

మరి ముఖ్యంగా చాలామంది కొండ ప్రదేశంలో చివరి అంచుల వరకు వెళ్లడం ఇంకొందరు నీటి దగ్గర భయంకరమైన స్టంట్ లు చేయడం, ఇక చాలామంది వాహనాలు రైల్స్ దగ్గర వెనకాల వచ్చే వాహనాలను చూపిస్తూ రీల్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా కూడా ఒక అలాంటి పనే చేసే ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇన్‌స్టారీల్స్ పై ఉన్న పిచ్చి చివరికి అతని ప్రాణాలు తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రహ్మత్ నగర్ శ్రీరామ్ నగర్ కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్పరాజ్ స్థానిక మదర్సాలో చదువుతున్నాడు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సర్పరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ పై ఇన్ స్టా షూట్ కి వెళ్లాడు.

 

ఎంఎంటీఎస్ రైలుకు అతి సమీపంలో నడుచుకుంటూ ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే లింగంపల్లి నుంచి సనత్ నగర్ మీదుగా వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ అతడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సర్పరాజ్ అక్కడిక్కడే మరణించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుగా విలపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -