Tamanna: వాళ్లది అంతా దొంగ ప్రేమ.. సర్వ నాశనం అవుతారు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు!

Tamanna: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నచిన్న సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన తమన్నా ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హోదాను సొంతం చేసుకుంది. ఏడాదికి చేతినిండా సినిమాలతో బాగా దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక ఈ బ్యూటీ ఒక బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం చేస్తుందన్న వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకు తను చేసిన కామెంట్లు ఏంటంటే.. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొందరు తనతో ఎంతో ప్రేమగా నటిస్తున్నారని.. కానీ అది ఒక ముసుగు మాత్రమే అని తనకు తెలుసని చెప్పుకొచ్చింది.

మనం ఎదుగుతుంటే వారు ఎంతో జలసీగా ఫీల్ అవుతూ ఉంటారని.. నిజ జీవితంలో ఇటువంటిది తను ఎదుర్కొన్నాను అని.. కానీ వాళ్ళు మాత్రం బయటకు ప్రేమను చూపిస్తున్నట్లు నటిస్తుంటారు అని తెలిపింది. అంతేకాకుండా అటువంటి వ్యక్తులతో తను చాలా ఇబ్బందులు పడ్డాను అని.. ఎవరి క్యారెక్టర్ ఎటువంటిది అనేది తనకు.. ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు అని వ్యాఖ్యలు చేసింది.

ఇక తమన్నా ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయటంతో ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది తమన్నాను ఎవరు ఏమన్నారు.. పర్సనల్ గా తనని ఎవరైనా అటాక్ చేస్తున్నారా అని తన అభిమానులు అనుమానం పడుతున్నారు. మరి తమన్నా ఈ విషయం గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో ఎదురు చూడక తప్పదు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.. బాంద్రా, అరణ్మనై, వేద అనే మరాఠ, తమిళ, హిందీ భాషలలో బిజీగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -