Tamannaah: తమన్నా గురించి మీకు తెలియని నిజం.. డబ్బుల కోసం ఏం చేస్తుందో తెలుసా?

Tamannaah: తెలుగు సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు తమన్నా. ఈమె గురించి తెలియని వారంటూ ఉండరు. కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇప్పటివరకు ఇండస్ట్రీ అందరు స్టార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చాలా మంది హీరోయిన్లకు స్టార్ హీరోతో ఒక్క ఛాన్స్ దొరకడమే కష్టంగా ఉంటుంది. అయితే తమన్నా మాత్రం ఒక్కో హీరోతో రెండు, మూడు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.

తమన్నా అందానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. యువతలో ఆమెకుండే ఫాలొయింగ్ చూస్తే అందరూ షాకవుతారు. తన అందాన్ని ప్లస్ చేసుకున్న తమన్నా.. సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు పడుతూ వచ్చింది. చిన్న పెద్ద సినిమాలంటూ తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించారు. తమన్నా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో, ఎన్టీఆర్ లవకుశ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించింది. అలాగే యావరేజ్ హీరోల సినిమాల్లో కూడా ఆమె ఐటెం సాంగ్స్ చేసింది.

అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ చేసిందంటే ఫ్యాన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ యావరేజ్ హీరోల సరసన కూడా ఐటెం సాంగ్స్ చేస్తుందనే సరికి ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమన్నా మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా తేడా లేకుండా.. డబ్బులు వస్తున్నాయా? లేదా? అదే రీజన్‌ను మాత్రమే చూసుకుంటుంది. మొదటి నుంచి తమన్నా అదే ఫాలొ అవుతూ వచ్చింది. అందుకే తాజాగా లస్ట్ స్టోరీస్ అనే వెబ్‌సిరీస్‌లో నటించేందుకు కూడా సిద్ధమైంది. నటనను నటన వరకు మాత్రమే చూడాలని, ఎలాంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలని తమన్నా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -