Tamannaah: చిల్లర పాత్రలకు కూడా ఓకే చెబుతున్న తమన్నా.. మరీ ఇంతలా దిగజారాలా?

Tamannaah : టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బోల్డ్ సన్నివేశాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

 

ఇకపోతే తమన్నా తాజాగా నటించిన జైలర్, భోళా శంకర్ సినిమాలు ఒకరోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి కానీ ఈ ట్రైలర్ వీడియోలో ఎక్కడ తమన్న కనిపించకపోవడం గమనార్హం.

ఇక ఈ సినిమాలో రిటైర్డ్ అయినటువంటి ఒక సీనియర్ సిటిజన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు ఈయనకి భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక ఈ ట్రైలర్ వీడియోలో తమన్నా ఎక్కడా కనిపించకపోవడంతో ఈమె కావాలయ్యా అనే పాటతో పాటు మరొక రెండు సన్నివేశాలలో కనిపించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నటువంటి భోళాశంకర్ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రానున్న నేపథ్యంలో చిరంజీవి కీర్తి సురేష్ మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది.

 

ఈ విధంగా తమన్నా ప్రాధాన్యత లేని సినిమాలకు కూడా కమిట్ అవుతూ ఉన్నారు.హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి తమన్నా ప్రస్తుతం ఫేడౌట్ దశలో ఉంది. దీంతో వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలి అన్న ధోరణిలో ఈమె తనకు ఎలాంటి అవకాశాలు వచ్చిన వదిలేదే లేదు అన్నట్టు చిన్న చిన్న పాత్రలకు కూడా సై అంటూ సినిమాలలో నటిస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -