Tammareddy Bharadwaja – Dil Raju: దిల్ రాజు వాయిదా వేసుకోమన్నారంటే నిఖిల్ గొప్పగా ఫీల్ అవ్వాలి: తమ్మారెడ్డి

Tammareddy Bharadwaja – Dil Raju: గత కొద్ది రోజుల నుంచి కార్తికేయ 2 సినిమా విషయంలో పెద్ద ఎత్తున దిల్ రాజు పేరు చర్చలలోకి వస్తోంది. దిల్ రాజు నిఖిల్ కు థియేటర్లు దొరక్కుండా అడ్డుకున్నారని, ఇదే విషయాన్ని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నిఖిల్ పరోక్షంగా కూడా వెల్లడించారని అందరూ భావిస్తున్నారు.ఇక ఇదే విషయంపై ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మీడియాపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక నిఖిల్ సైతం తన సినిమా హిట్ అవుతేనే పెద్ద వాళ్లతో గొడవ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ దిల్ రాజు వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందని ఒక్కసారిగా ఫ్లేట్ పీఠాయించారు. నా సినిమా విడుదల వాయిదాకు దిల్ రాజుకు ఏమాత్రం సంబంధం లేదని ఒక్కసారిగా మాట మార్చడంతో నిఖిల్ వ్యాఖ్యలు కాస్త సెన్సేషనల్ అవుతున్నాయి. ఇక ఈ విధంగా వివాదంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని తెలిపారు.

సాధారణంగా ఒక సినిమా వస్తుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఇది ఇప్పటినుంచి వస్తున్నది కాదు ఎప్పటినుంచో హీరోలు నిర్మాతలు ఇలా తమ సినిమా కోసం ఇతరులను వాయిదా వేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే దిల్ రాజు కూడా కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి తమ సినిమాని వాయిదా వేసుకోమని అడిగి ఉండవచ్చు.ఇలా దిల్ రాజు వంటి వారే ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని అడిగారంటే ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలని తమ్మారెడ్డి వెల్లడించారు.

ఇక కార్తికేయ 2 సినిమా పక్కా హిట్ అవుతుందని దిల్ రాజు ముందే ఊహించారు. అందుకే తన సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. ఇక కార్తికేయ 2సినిమా పెద్దగా ఆడదని తెలిసి ఉంటే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇలా దిల్ రాజు అడిగినప్పుడు నిఖిల్ సరే అన్న మీకోసం ఒక వారం వాయిదా వేసుకుంటాను అని అంటే అక్కడితో సరిపోయేది.

కేవలం కార్తికేయ 2 సినిమాకు భయపడే దిల్ రాజు తన సినిమాని వాయిదా వేసుకోమనీ అడిగి ఉంటారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే నిఖిల్ మాత్రం దిల్ రాజు అలా అడగలేదంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -