TDP-Janasena: తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల లెక్క ఇదే.. పవన్ కళ్యాణ్ పార్టీకి మరీ ఇంత ఘోరమా?

TDP-Janasena:  తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముగ్గురు కలసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసిన విషయం తెలిసిందే. అనంతరం బయటికి వచ్చినా పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే పొత్తు విషయం గురించి కూడా స్పందించారు పవన్ కళ్యాణ్.. ఇంత కాలం టీడీపీతో క‌లిసి పోటీ చేయాలా? వ‌ద్దా? అనే సంశ‌యంలో ఉన్నానను. కానీ ఇవాళ్టితో క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు.

చంద్ర‌బాబు అంత‌టి నాయ‌కుడినే జైల్లో పెట్టిన‌ప్పుడు, ఇక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌కుండా ఎలా ఉండాలంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. కాగా టీడీపీ, జ‌న‌సేన పొత్తు ప్ర‌క‌ట‌న కేవ‌లం లాంఛ‌న‌మే అని, వాళ్లిద్ద‌రి ముందే ఒక అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని స‌మాచారం. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 23 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాలు ఇచ్చేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారు. ఇదే మ‌హాప్ర‌సాద‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఇందుకు అంగీక‌రించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్‌ ను చూడాల‌నే కోరిక‌ను జ‌న‌సేన శ్రేణులు మ‌రిచిపోవాల్సిందే అన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే..

152 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. బీజేపీతో సంబంధం లేకుండానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ, జ‌న‌సేన నిర్ణ‌యించుకున్నాయి. వామ‌పక్షాలు త‌మ‌కు క‌నీసం ఒక్కో సీటు కావాల‌ని కోరుతున్నాయి. అయితే వాటిని క‌లుపుకుంటారా? లేదా? అనేది చంద్ర‌బాబు నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి వుంటుంది. ఇదిలా వుండ‌గా టీడీపీతో పొత్తును అధికారికంగా ప్ర‌క‌టించేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక సాకు కోసం ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -