TDP – YSRCP: నాలుగో విడత ఎన్నిక ప్రతిపక్ష పార్టీలకే అనుకూలమా.. అధికారులు తటస్థంగా ఉంటే వైసీపీకి కష్టమేనా?

TDP – YSRCP: ఏపీలో రాజకీయ పరిస్థితులు టీడీపీ కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రచారానికి ఎక్కువ సమయం ఉంది. గత ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 11 పోలింగ్ జరిగింది. అంటే మధ్యలో 32 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సారి షెడ్యూల్ మార్చి 17న వచ్చింది. పోలింగ్ మే 13న జరుగుతుంది. అంటే.. ఏకంగా 58 రోజులు సమయం ఉంది. ఈ టైం టీడీపీ కూటమి ఎన్నికలకు సమాయత్తం కావొచ్చు.

2019 లో పరిస్థితి ఇది..

గత ఎన్నికల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా ఉన్నారు. ఆ 32 రోజుల్లోనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు వ్యూహాలు సిద్దం చేసుకొని అమలు చేయాల్సి ఉందేది. పైగా అప్పుడు చంద్రబాబుకి ప్రత్యర్థులు ఎక్కువ. జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసినా.. రాష్ట్రానికి వచ్చేసరికి ఎవరూ ఉపయోగపడే అవకాశం లేదు. కానీ, రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులు ఎక్కువగా ఉండేవారు. వైసీపీ అధినేత జగన్ అప్పటికే వ్యూహాలు అన్నీ సిద్దం చేసుకొని రంగంలో దిగారు. దీనికి తోడు జనసేన కూడా టీడీపీతో తెగదెంపులు చేసుకొని ఒంటరి పోరుకు సిద్ధమైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో చంద్రబాబును మహాకూటమిని ఏర్పాటు చేశారు. దానికి ప్రతిగా 2019లో ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు నిధులు అందకుండా కేసీఆర్ చేశారు. అటు.. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి కట్టడంతో.. ఏపీలో చంద్రబాబును ఓడించడానికి మోడీ, అమిత్ షా సర్వశక్తులు ఒడ్డారు. అందులో భాగంగానే.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా ఏపీ ఎన్నికల పోలింగ్ తేదీని ప్రకటించారు. దీంతో… 32 రోజుల్లో ఇంతమంది ప్రత్యర్థులను ఎదుర్కోలేక.. ప్రచారం చేయలేక టీడీపీ ఘోర ఓటమిని చూసింది.

రేపటి ఎన్నికల్లో అన్ని అనుకూలమే!

అయితే ఈసారి అనుకూల పవనాలు వీస్తున్నాయి. 57 రోజుల సమయం ఉండటంతో నిదానంగా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటన దాదాపు పూర్తి అయింది. మిగిలిన స్థానాలకు ఇవాళో రేపో అన్నట్టు ఉంది. టీడీపీ, జనసేన కలయికతో ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి కూడా 57 రోజుల సమయం సరిపోతుంది. ఇంత వరకు ఎన్నికల కోడ్ అమలులో లేదు కనుక ప్రతిపక్షాల ప్రచారానికి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేంది. కానీ.. ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చింది కనుక 57 రోజుల పాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. పైగా బీజేపీ కూడా పొత్తులో ఉంది కనుక వైసీపీ నేతల అరాచకాలు తగ్గే అవకాశం ఉంది. వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకనేందుకు జగన్ ప్రయత్నించినా.. బీజేపీ అండలేకుండా అది కుదరదు. అయితే.. ఎక్కువ రోజులు సమయం ఉండటంతో ఎన్నికల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కార్యకర్తలను ఈ 57 రోజుల పాటు పెంచి పోషించాలి. నిజానికి అధికార పార్టీకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఖర్చు చేసేశారు. ఇంకా ఖర్చు అంటే తలకు మించిన భారంగా మారుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -