TDP Victory: పాతికేళ్లుగా గెలవని సీటులో టీడీపీకి గెలుపు ఖాయమా.. అక్కడ కచ్చితంగా సత్తా చాటుతుందా?

TDP Victory: తెలుగుదేశం పార్టీ విశాఖలో ఎంపీ సీటు గెలుచుకొని దాదాపు పాతిక సంవత్సరాలు కావస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఎలక్షన్లు వచ్చినప్పటికీ విశాఖ ఎంపీ సీటును మాత్రం ఇప్పటివరకు గెలవలేకపోయింది. 1999లో. ఆనాడు దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి ఆ సీటు నుంచి రెండోమారు గెలిచారు. దాని కంటే ముందు టీడీపీ 1983 నుంచి జరిపిన రాజకీయ ప్రస్థానంలో విశాఖ ఎంపీ సీటుని మూడు సార్లు మాత్రమే గెలుచుకుంది అని చరిత్ర చెబుతోంది.

టీడీపీ ఏర్పడ్డాక పదిసార్లు ఎంపీ ఎలక్షన్లు జరిగితే విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ అయిదు సార్లు గెలిస్తే బీజేపీ వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఈ సీటులో ఎక్కువగా కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత బలం కాస్తా వైసీపీకి షిఫ్ట్ అవుతోంది. టిడిపి నుంచి 2004,2009 సంవత్సరాలలో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎంవీవీస్ మూర్తి పోటీ చేసి ఓటమి ఫాలయ్యారు.

2019 సంవత్సరంలో మాత్రం ఎంవీవీస్ మూర్తిమనవడు శ్రీభరత్ 2019లో ఓటమి పాలు అయ్యారు. కానీ ఈసారి మాత్రం కాస్త రాజకీయాలు మారుతున్నాయని తెలుస్తుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కూటమితో ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో 2024 లో జరగబోయే ఎన్నికల్లో చాలా కఠినంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇలా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో కొంతమేర సానుకూలత ఏర్పడిందని తెలుస్తుంది. మరి ఈసారి ఎన్నికలలోనైనా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేనా లేకపోతే ముచ్చటగా మూడోసారి వైసిపినే ఇక్కడ జెండా ఎగరవేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -